సీమాంధ్ర లాయర్లపై దాడి దారుణం: భూమన | MLA Bhumana Karunakar Reddy Condemn Attack on Seemandhra Lawyers | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర లాయర్లపై దాడి దారుణం: భూమన

Published Fri, Sep 6 2013 4:14 PM | Last Updated on Tue, Oct 30 2018 4:17 PM

సీమాంధ్ర లాయర్లపై దాడి దారుణం: భూమన - Sakshi

సీమాంధ్ర లాయర్లపై దాడి దారుణం: భూమన

హైదరాబాద్‌లో సీమాంధ్ర లాయర్లపై దాడి దారుణమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు యుగంధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ లాయర్లు అప్రజాస్వామికంగా వ్యవహరించారని వారు పేర్కొన్నారు. తెలంగాణలో ఉద్యమాలు జరిగినప్పుడు సీమాంధ్ర లాయర్లు ఎలాంటి దాడులు చేయలేదని గుర్తు చేశారు. హైకోర్టు ప్రాంగణంలో సీమాంధ్ర లాయర్లపై దాడి ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని అన్నారు. ఇలాంటి చర్యలతో సమైక్య ఉద్యమం మరింత బలపడుతుందని చెప్పారు.

హైకోర్టులో సీమాంధ్ర లాయర్లపై తెలంగాణ న్యాయవాదుల దాడిని విశాఖపట్టణం బార్‌ అసోసియేషన్ ఖండించింది. దాడికి నిరసనగా జిల్లాకోర్టు దగ్గర న్యాయవాదుల రాస్తారోకో నిర్వహించారు. మానవహారం చేపట్టారు. తమ ప్రాంత న్యాయవాదులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement