హైదరాబాద్ : రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ వెన్నుదన్నుగా నిలుస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఆయన శుక్రవారమిక్కడ అసెంబ్లీ వాయిదా అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఆ రెండు పార్టీలకు చెందిన ఇరు ప్రాంతాల నేతలు ఒక్కటై .... విభజన బిల్లును ముందుకు తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. సమైక్య ముసుగులో టీడీపీ విభజన బిల్లును పాస్ చేయించేందుకు ప్రయత్నిస్తోందని భూమన ధ్వజమెత్తారు. విభజన బిల్లుపై ముందు ఓటింగ్ పెడితే ఎవరు సమైక్యవాదో, ఎవరు ప్రత్యేక వాదో తేలిపోతుందని భూమన అన్నారు.