హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రతులు అసెంబ్లీకి చేరాయి. తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులు శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శికి చేరాయి. రాజ్భవన్ ద్వారా ముసాయిదా బిల్లు అసెంబ్లీకి చేరింది. ప్రభుత్వ ఉన్నతాధికారులు అజయ్ కల్లమ్, శివశంకర్లకు ప్రతులను అందచేశారు. మరోవైపు విపక్షాల నిరసనల మధ్య శాసనసభ సమావేశాలు రెండోరోజు ఎలాంటి చర్చ జరగకుండానే సోమవారానికి వాయిదా పడ్డాయి. సమైక్య, తెలంగాణ నినాదాలతో అసెంబ్లీ దద్దరిల్లింది. దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో అసెంబ్లీ మూడుసార్లు వాయిదా పడింది.