
వెంటిలేటర్‌పై వెంకటరమణ
తిరుపతి:తీవ్ర అస్వస్థతకు గురై స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుపతి ఎమ్మెల్యే ఎం. వెంకటరమణకు వెంటిలేటర్‌పై వైద్యసేవలు కొనసాగుతున్నాయని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. షుగర్ లెవల్స్ తగ్గడం, బీపీ లెవల్స్ పడిపోవడంతో ఆయనను శనివారం రాత్రి స్విమ్స్ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. స్విమ్స్ డెరైక్టర్ డాక్టర్ వెంగమ్మ పర్యవేక్షణలో ఎమ్మెల్యే వెంకటరమణకు వైద్యసేవలు అందిస్తున్నారు.
శనివారం రాత్రి నుంచే వెంటి లేటర్‌పై డయాలసిస్ చేశారు. ఆదివారం షుగర్, బీపీ లెవల్స్ అదుపులోకి వచ్చాయని, డయాలసిస్ చేస్తున్నారని డాక్టర్ వెంగమ్మ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.