
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అవసరమైన చోట మరిన్ని ఫేర్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర హోం మంత్రి సుచరిత అన్నారు. సోమవారం ఆమె అసెంబ్లీ ప్రాంగణంలో కొత్త అగ్ని మాపక వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రస్తుతం 173 ఫైర్ స్టేషన్లు, 5 టెంపరరీ స్టేషన్లు ఉన్నాయని, అవసరమైతే మరిన్ని స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. అగ్ని ప్రమాదాల నష్టాన్ని తగ్గించేందుకు కొత్తగా 25 వాహానాలకు పర్మీషన్ ఇచ్చామన్నారు. రాయలసీమ సబంధించిన 5 వాహనాలు కర్నూల్‌కు తరలించారని, ఇక్కడ అవసరమైన వాహనాలు సమకూరుస్తామని స్పష్టం చేశారు. ఈ బడ్జెట్‌లో వాహానాల కొనుగోలుకు రూ.4 కోట్లు, ఫాబ్రికేషన్‌కు రూ.6 కోట్లు కేటాయించామన్నారు. నూతన వాహానాలతో పాటు మరిన్ని ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేసి విపత్తు నివారణకు చర్యలు తీసుకుమామని మంత్రి సుచరిత పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment