అమ్మకు ఫోన్ చేసిన అరగంటకే.. | Mother Aragantake phone is made .. | Sakshi
Sakshi News home page

అమ్మకు ఫోన్ చేసిన అరగంటకే..

Published Wed, Feb 3 2016 2:04 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

అమ్మకు ఫోన్ చేసిన అరగంటకే.. - Sakshi

అమ్మకు ఫోన్ చేసిన అరగంటకే..

 బూర్జ: తోటవాడ గ్రామానికి చెందిన చోడి లక్ష్మీ నరసింహరాజు (23)కర్నాటకలోని బీదర్‌లో ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేస్తున్నారు. అతను ఆదివారం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న గృహం నుంచి విధులకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాజు మృతదేహం మంగళవారం తోటవాడ గ్రామానికి చేరుకుంది. దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.ఇంటి దీపం  ఆరిపోయింది మా ఇంటి దీపం ఆరిపోయిందని తల్లితండ్రులు చోడి రమణమ్మ, అప్పారావు కుమారుని మృతదేహంపై పడి బోరున విలపించారు.  సంక్రాంతి పండగకు 20రోజులు సెలవుపై వచ్చిన తమ కుమారుడు, తమతోపాటు మిత్రులతో ఎంతో ఆనందంగా గడిపాడని, ఇంతలోనే మాయమయ్యాడని వారు రోదించిన తీరు స్థానికులను కలిచివేసింది.


అక్కడ ఉద్యోగానికి వెళ్లేందుకు ద్విచక్రవాహనం అవసరమంటూ శ్రీకాకుళంలో వాహనాన్ని కొనుగోలు చేసుకొని నాలుగు రోజుల కిందటే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లాడని చెప్పారు. హైదరాబాద్ చేరుకొని,  ఇక్కడ నుండి పార్సిల్ చేసిన బండిని తీసుకున్నానని మరుసటి రోజు ఫోన్‌చేసిన అరగంటలోనే కుమారుడి మరణవార్త తెలియటంతో నమ్మలేకపోయామని వారు గుండెలు బాదుకున్నారు. తమ కుమారుడు ఉద్యోగం చేసి ప్రయోజకుడయ్యాడని ఇక మా కష్టాలు గట్టేక్కాయని ఎంతో సంతోషపడ్డామని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని బోరు రోదించారు. ఇక ఈ కుటుంబ భారం నా కొడుకే చూసుకుంటాడనుకుంటే.. దేవుడు మా కొడుకు ప్రాణాలు తీసుకువెళ్లాడంటూ వారు నెత్తీ నోరు కొట్టుకొని ఏడుస్తూ  కుప్పకూలిపోయారు. లక్ష్మీనరసింహరాజు మృతిని మిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. బంధువులు, మిత్రులు,తోటి ఉద్యోగులతో ఆ గ్రామం విషాద ఛాయల్లో మునిగిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement