కళ్లు తెరచిన 20 రోజులకే ఓ పసిపాపను కన్నతల్లే చంపేసింది.
గిద్దలూరు (ప్రకాశం జిల్లా) : కళ్లు తెరచిన 20 రోజులకే ఓ పసిపాపను కన్నతల్లే చంపేసింది. ఈ దారుణం ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం నాగులవరం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. సుభాషిణి అనే వివాహితకు మానసికస్థితి సరిగా లేదు. ఆమె 20 రోజుల క్రితం పాపను ప్రసవించింది.
ఆమె భర్త ఆర్మీలో పనిచేస్తున్నాడు. దీంతో నాగులవరంలో ఉన్న సోదరి ఇంటి వద్ద ఉంటోంది. ఏమైందో ఏమో గానీ.. సోమవారం సుభాషిణి తన చిన్నారిని గొంతునులిమి హత్య చేసింది. కుటుంబ సభ్యులు గుర్తించేలోపే దారుణం జరిగిపోయింది. దీంతో వారు సుభాషిణిని ఆస్పత్రికి తరలించారు.