లైంగిక దాడికి గురైన బాలిక తల్లిపై అత్యాచారం | mother of rape victim raped by three youth | Sakshi
Sakshi News home page

లైంగిక దాడికి గురైన బాలిక తల్లిపై అత్యాచారం

Published Thu, Jan 9 2014 10:16 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

mother of rape victim raped by three youth

నల్గొండ : నల్గొండ జిల్లాలో మరో దారుణం జరిగింది. మృగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. హాలియా మండలం సూటిపేటతండాలో గిరిజన మూగ మహిళపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇటీవల సంచలనం కలిగించిన ఏనెమిదిడా తండా ఆశ్రమ పాఠశాలలో లైంగికదాడికి గురైన బాలిక తల్లి ఒంటరిగా ఉన్న సమయంలో  ఆమెపై అత్యాచారం చేశారు. బాధిత బాలికకు కౌన్సెలింగ్‌ ఇప్పించేందుకు ఆమె తండ్రి హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో ఈ దారుణం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కాగా అభం శుభం తెలియని పదకొండేళ్లలోపు ఉన్న 11 మంది బాలికలపై మూడు మాసాలుగా అత్యాచారం చేస్తున్నాడో మానవమృగం. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని  తండాలో ఓ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమంలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురిని సస్పెండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement