విమానాశ్రయంలో జేసీ వీరంగం
బోర్డింగ్ పాసు ఇవ్వకపోవడంతో సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం
విమానాశ్రయం(గన్నవరం): గన్నవరం విమానాశ్రయంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి శుక్రవారం ఎయిర్ ఇండియా అధికారులపై చిందులు తొక్కారు. హైదరాబాద్ వెళ్లేందుకు ఆలస్యంగా ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆయన అప్పటికే బోర్డింగ్ క్లోజ్ కావడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. నా టిక్కెట్ రద్దు చేస్తారా? అంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో తిట్లపురాణం అందుకున్నారు.
ఎయిర్ ఇండియా కార్యాలయంలోకి దూసుకెళ్లి అక్కడున్న కంప్యూటర్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదంతం అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎయిర్‌పోర్టు లాంజ్‌రూమ్‌లో ఉండగానే జరగడం గమనార్హం.