త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
హైదరాబాద్: త్వరలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని మంత్రి జానారెడ్డి తెలిపారు. ఏకగ్రీవమైన చిన్న పంచాయతీలకు రూ. ఏడు లక్షల ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే మేజర్ పంచాయతీలకు రూ.20 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన జానారెడ్డి .. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు గురించి గళం విప్పారు. త్వరలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయన్నారు.
ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాన్ని పంచాయతీలు వినియోగించుకోవాలని జానా అన్నారు. కేసీఆర్‌పై హత్యాయత్నం చేస్తున్నారనే సమాచారం ఏదీ తనకు అందలేదని తెలిపారు.
రాష్ర్ట విభజనకు సంబంధించి గతంలోనే ఆయన స్పందించిన విషయం తెలిసిందే. అభివృద్ధి కుంటుపడకముందే, పరిస్థితి చేయిజారకముందే, అవాంఛనీయ పరిణామాలు తలెత్తకముందే అధిష్టానం ఈ సమస్యను పరిష్కరించాలని కోరినట్లు ఆయన తెలిపారు. సమస్యను సామరస్యంగా పరిష్కారించుకుందామని రాష్ట్ర ప్రజలకు ఆయన పిలుపు ఇచ్చారు. రెండు ప్రాంతాల ప్రజలు అభివృద్ధి పథంలో పయనించాలన్నదే తమ ఉద్దేశం అన్నారు.