'రాష్ట్రంలో హిట్లర్ వంశీయుల పాలన' | mudragada criticises ap government on his house arrest | Sakshi
Sakshi News home page

'రాష్ట్రంలో హిట్లర్ వంశీయుల పాలన'

Published Tue, Jan 24 2017 5:49 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM

'రాష్ట్రంలో హిట్లర్ వంశీయుల పాలన'

'రాష్ట్రంలో హిట్లర్ వంశీయుల పాలన'

కిర్లంపూడి: ఆంధ్రప్రదేశ్‌లో హిట్లర్ వంశీయుల పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం సత్యాగ్రహ యాత్ర తలపెట్టిన ముద్రగడను తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగృహంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కాపు ఉద్యమనేత ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ.. మా జాతికి పోలీసుల నుంచి స్వేచ్ఛ లభించినప్పుడు సత్యాగ్రహ యాత్ర గురించి ఆలోచిస్తా అన్నారు. పోలీసుల కవాతులు, కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. తుని ఘటనలో మా ప్రమేయం ఉంటే అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement