
ఈసారి చావో-బతుకో తప్ప..!
కాకినాడ: అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నా.. తమ జాతి (బలిజ, తెలగ, కాపుల)కి బీసీ రిజర్వేషన్ ఇస్తానన్న హామీని చంద్రబాబునాయుడు నిలబెట్టుకోలేదని, ఈ విషయంలో తాము ఇంకా ఎన్నాళ్లు నిరీక్షించాలని కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఏపీ సీఎం చంద్రబాబుకు ఆదివారం లేఖ రాశారు.
మా జాతి ఓట్లతో అధికారంలోకి వచ్చినా రిజర్వేషన్లు అమలుచేయాలన్న ఆలోచన మీకు ఎందుకు రావడం లేదని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. తమకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఏం కోరుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఈసారి చావో, బతుకో తప్ప తమ పోరాటానికి విరామం లేదని పేర్కొన్నారు. రాజధాని, బందరు పోర్టు, పరిశ్రమల పేరిట అమాయక రైతుల భూములను అర్ధరాత్రి సంతకాలు చేయించి లాక్కొంటున్నారని, కానీ తమ జాతికి ఇచ్చిన హామీని నెరవేర్చడం లేదని అన్నారు.