జిల్లాలోని‘ పచ్చ’ నేతల్లో గుబులు
వలపన్ని బదానీని అరెస్ట్ చేసిన ప్రత్యేక బృందం
క్రైం( కడప అర్బన్ ) : అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ ముఖేష్ బదానీని జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ ఆదేశాల మేరకు జిల్లా ప్రత్యేక బృందం పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని నేడో, రేపో జిల్లాకు తీసుకురానున్నారు. హర్యానా రాష్ట్రం హిస్సార్ జిల్లాకు చెందిన ముఖేష్ బదానీ అంతర్జాతీయ స్థాయిలో ఎర్ర చందనం స్మగ్లర్‌గా పేరొందాడు. జిల్లాలోని కొందరు ‘పచ్చ’ నేతలతో నేరుగా సంబంధాలను కలిగి ఉన్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ముఖేష్ బదానీని హర్యానాలో అరెస్టు చేసిన పోలీసులు జిల్లాకు తెస్తున్నారని తెలియగానే వారిలో వణుకు పుడుతోంది.
ఇప్పటికే అతనితో సన్నిహిత సంబంధాలను కొనసాగించిన వారిలో కొందరిని అట్లూరు, బద్వేలు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ముఖేష్ బదానీని జిల్లాలోని రాజంపేట డీఎస్పీ అరవిందబాబు, సీఐలు రాజేంద్రప్రసాద్, వెంకటప్ప, మరికొంతమంది సిబ్బంది అరెస్ట్ చేసి జిల్లాకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. సోమ లేదా మంగళ వారాల్లో జిల్లాకు తీసుకొచ్చి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి.
‘ఎర్ర’ కేసులో నేడో, రేపో కడపకు ముఖేష్ బదాని?
Published Mon, May 18 2015 4:33 AM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM
Advertisement
Advertisement