నేడు కడపకు స్మగ్లర్ ముఖేష్ బదానీ | Smuggler mukesh badhani to be arrived kadapa with special police team | Sakshi
Sakshi News home page

నేడు కడపకు స్మగ్లర్ ముఖేష్ బదానీ

Published Mon, May 18 2015 3:44 PM | Last Updated on Sun, Sep 3 2017 2:17 AM

Smuggler mukesh badhani to be arrived kadapa with special police team

కడప: అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ ముఖేష్ బదానీని జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ ఆదేశాల మేరకు జిల్లా ప్రత్యేక బృందం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు బదానీని కడపకు పోలీసులు తీసుకరానున్నట్టు తెలుస్తోంది. బదానీతో పాటు ప్రత్యేక పోలీస్ బృందం సాయంత్రం 8 గంటలకు కడపకు చేరుకోనున్నారు. హర్యానా రాష్ట్రం హిస్సార్ జిల్లాకు చెందిన ముఖేష్ బదానీ అంతర్జాతీయ స్థాయిలో ఎర్ర చందనం స్మగ్లర్‌గా పేరొందాడు.

ఇప్పటికే అతనితో సన్నిహిత సంబంధాలను కొనసాగించిన వారిలో కొందరిని అట్లూరు, బద్వేలు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ముఖేష్ బదానీని జిల్లాలోని రాజంపేట డీఎస్పీ అరవిందబాబు, సీఐలు రాజేంద్రప్రసాద్, వెంకటప్ప, మరికొంతమంది సిబ్బంది అరెస్ట్ చేసి జిల్లాకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ముఖేష్ బదానీని రేపు మీడియా ముందు ప్రవేశపెట్టి కోర్టులో హాజరుపర్చనున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, ముఖేష్ బదానీ తనకు స్మగ్లింగ్తో ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నాడు. తాను లైసెన్స్డ్ ఎర్రచందనం వ్యాపారి అని చెప్పినా తనను పోలీసులు అరెస్ట్ చేశారని ముఖేష్ వాదిస్తున్నాడు.

Advertisement

పోల్

Advertisement