
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం నుంచి నిరవధిక సమ్మెను ప్రారంభించారు. మొత్తం 110 మున్సిపాల్టీలకుగాను తొలిరోజు 98 మున్సిపాల్టీల్లో సమ్మె విజయవంతంగా జరిగింది. సీఐటీయూ, ఐఎఫ్‌టీయూసీల ప్రాబల్యం ఉన్న మున్సిపాల్టీల్లోని కార్మికులు, ఉద్యోగులు విధులకు హాజరుకాకుండా సమ్మెను జయప్రదం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో ధర్నాలు, రాస్తారాకోలు, ప్రదర్శనలు నిర్వహించారు.
సోమవారం సాయంత్రంలోపు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ రాకపోతే మంగళవారం నుంచి సమ్మెలో పాల్గొంటామని ఏఐటీయూసీ ప్రకటించిన విషయం విదితమే. ఈ మేరకు ఆ సంఘానికి చెందిన కార్మికులు సోమవారం విధులకు హాజరయ్యారు. విజయవాడ, గుంటూరుల్లో సీఐటీయూ సంఘాల నాయకత్వంలో, మిగిలిన జిల్లాల్లో ఉద్యోగ సంఘాల ప్రాబల్యానికి అనుగుణంగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు.కార్మికులందరినీ ఉద్యోగాల్లో కొనసాగించడం, ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment