మున్సిపాలిటీకి బకాయిల బెడద
Published Sun, Jan 26 2014 3:39 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: మున్సిపాలిటీకి ఆదాయూన్ని సమకూర్చే పన్నులను వసూలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. ముఖ్యంగా మొండి బకాయిలను ఎలా వసూలు చేయూలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మున్సిపాల్టీకి ఆస్తిపన్ను, కుళాయి పన్ను, మున్సిపల్ కాంప్లెక్స్‌లకు వచ్చే అద్దెల నుంచి ఎక్కువగా ఆదాయం వస్తుంది. అయితే సమైక్యాంధ్ర ప్రభావం తదితర కారణా ల వల్ల పన్నులు వసూలు ఆశించినంత మేర జరగలేదు. మరోవైపు ఈ ఏడాది మార్చి నెలాఖరుకు గడువు ముగియనుండడంతో పన్నుల వసూలు లక్ష్యం సాధించగలమా అన్న సందేహాలు అధికారుల్లో వ్యక్తమవుతున్నాయి.
రూ.6 కోట్లే వసూలు..
పట్టణంలో సుమారు 47 వేల ఇళ్లు ఉన్నాయి. ప్రతి ఇంటికి సుమారు రూ.500 నుంచి ఆస్తిపన్నును వసూలు చేస్తారు. ఈ లెక్కన ఈ ఏడాది రూ.18కోట్లను వసూలు చేయూల్సి ఉంది. ఇప్పటివరకు ఆరు కోట్లు మాత్రమే వసూలు చేయగా, ఇంకా రూ.12కోట్లు బకాయిలు ఉన్నా యి. పట్టణంలో 18 వేల ఇంటింటి కుళాయిలు ఉండగా, ప్రభుత్వ కుళాయిలు 400, కమర్షియల్ కుళాయిలు 7వేల వరకు ఉన్నాయి. ప్రతి కుళాయికు రూ. 60 నుంచి వసూలు చేస్తారు. కుళాయి పన్ను మూడున్నర కోట్లకు గాను ఇప్పటివరకు రూ.50 లక్షలు మాత్రమే వసూలు చేశారు. ఇంకా వసూలు చేయాల్సింది మూడు కోట్లపైనే ఉంది. మున్సిపాలిటీలో 400 వరకు భవనాలు ఉన్నాయి. వాటి ద్వారా అద్దె రూ.60 లక్షల వరకు వసూలు కావాల్సి ఉంది.
ప్రత్యేక బృందాలు ఏర్పాటు..
మున్సిపాలిటీలో వసూలు కావాల్సిన మొండి బకాయిల కోసం అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. కుళాయి, ఆస్తిపన్నుల వసూల కోసం ఇప్పటికే ప్రతి ఇంటికి వెళ్లి నోటీసులు అందించారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి పన్నులు పూర్తిస్థారుులో వసూలు చేయూలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
-ఎస్.గోవిందస్వామి, మున్సిపల్ కమిషనర్
Advertisement
Advertisement