
పీలేరులో దారుణ హత్య : నగలు, నగదు చోరీ
చిత్తూరు: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం పీలేరు దుర్గానగర్లో పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయురాలు యశోదమ్మను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. దుండగులు నగలు, నగదు తీసుకొని పారిపోయారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగిగారు. జాగిలాలతో దుండగుల కోసం గాలిస్తున్నారు. క్లూస్ టీమ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాల కోసం పరిశీలిస్తున్నారు. అయితే దుండగులు ఆధారాలు దొరకకుండా జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. అయినా క్లూస్ టీమ్ తమ పంధాలో ఆధారాల కోసం ప్రయత్నిస్తోంది.
యశోదమ్మ కూతురు,అల్లుడు ఉద్యోగం చేస్తున్నారు. వారు వచ్చిన తరువాత మాత్రమే ఎంత నగదు, నగలు పోయిందో తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. చుట్టుపక్కల ఎవరో తెలిసినవారే ఈ హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. ఆమెకు ఎవరైనా ప్రత్యర్థులు ఉన్నారా? అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.