వీడని మిస్టరీలు.. | murder mystery | Sakshi
Sakshi News home page

వీడని మిస్టరీలు..

Published Tue, Feb 25 2014 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 4:03 AM

వీడని మిస్టరీలు..

వీడని మిస్టరీలు..

 వీణవంక మండలం ఐలాబాద్‌లో జరిగిన తోటి చంద్రయ్య హత్య కేసు ఇంకా మిస్టరీగానే మారింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు రామిడి రాజు హైదరాబాద్‌లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు.

 

దీంతో పోలీసులు  కేసును పక్కకు పడేయడంతో నిందితులు ఎ వరనేది మిస్టరీగానే మిగిలింది. మండలంలోని ఐలబా ద్ గ్రామంలో జనవరి 22న అర్ధరాత్రి తోటి చంద్రయ్య దారుణహత్యకు గురయ్యాడు. ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఒక్కరు బైక్ వద్ద ఉండగా.. ఇద్దరు ముసుగులు ధరించి అన్నలం వచ్చామంటూ తలుపులు తీయమని కత్తులతో చంద్రయ్యను పొడిచారు. అడ్డొచ్చిన అతడి భా ర్య లక్ష్మిని బీరు సీసాతో గాయపర్చారు. ఈ సంఘటన అప్పట్లో జిల్లాలో సంచలనం రేగింది. ఈ హత్య భతాగాదాలతోనే జరిగిందని, గ్రామానికి చెందిన కొందరు వ్యక్తుల పనేని ప్రత్యర్థుల ఇంటి ఎదుట శవంతో బంధువులు ధర్నా చేశారు. చంద్రయ్య వద్ద గతంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేసిన రామిడి రాజు ప్రధాన నిందితుడని పోలీసులు నిర్ధారించారు. రాజును పోలీసులు పట్టుకునే సమయంలో హైదరాబాద్‌లో అనుమానాస్పదస్థితిలో జనవరి 24న రైలు ప్రమాదంలో చనిపోయాడు. అప్పటి నుంచి పోలీసులు కేసును పట్టించుకోవడం మానేశారు. దీంతో చంద్రయ్య హత్య మిస్టరీగానే మిగిలింది. అయితే బైక్‌పై ముగ్గురు వ్యక్తులు వచ్చారని చంద్రయ్య భార్య లక్ష్మి ఆరోపించగా.. మిగిలిన ఆ ఇద్దరు ఎవరనేది తేలాల్సి ఉంది. పోలీసులు సైతం ఆ ఇద్దరు వ్యక్తుల గురించి వాకబు చేసిన సంఘటనలు లేవు.  

 

 రాజుది హత్య..ఆత్మహత్యా..?
 చంద్రయ్య హత్యలో ప్రధాన నిందితుడు రాజు జనవరి 24న హైదరాబాద్‌లోని యాకబ్‌పూర-ఉపుగూడ రైల్వే ట్రాక్‌పై శవమై తేలడం అప్పట్లో కలకలం సృష్టించింది. రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేసిన, ఇక్కడి పోలీసులు మాత్రం రాజు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. సాక్ష్యం లేకుండా చేయడానికే రాజును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతుడి అన్న ఆరోపించడం చర్చనీయూంశంగా మారింది. దీంతో అటు చంద్రయ్య హత్య, ఇటు రాజు మృతి మిస్టరీగానే మిగిలాయి. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని చంద్రయ్య హత్య మిస్టరీని ఛేదించాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement