
సాక్షి, తూర్పు గోదావరి : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావుపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అన్నారు. సోమవారం ఆయన అన్నవరంలో మీడియాతో మాట్లాడుతూ.. బీసీ సభలు పెట్టి బీసీలకు అది చేస్తాను, ఇది చేస్తాను అంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదటిసారిగా బీసీ వ్యక్తి ప్రధానమంత్రి అయితే అతన్ని దింపుతానంటూ తిరుగుతున్నాడని మండిపడ్డారు.
చంద్రబాబు తెలంగాణ వెళ్లి ‘ నేను లేఖ ఇవ్వటం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింద’ని అక్కడ మాట్లాడి, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీశారంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జీవితంలో ప్రాంతీయ పార్టీ (తెలుగుదేశం) పెట్టి పెద్ద తప్పు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment