రాజమండ్రి:రాష్ట్ర విభజన తరువాత తొలిసారి రాష్ట్రస్థాయిలో రాజమండ్రిలో 16 రోజుల పాటు జరిగిన నంది నాటకోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఈ నంది నాటకోత్సవాల్లో 2013 సంవత్సరానికి గాను 'దేశమును ప్రేమించుమన్నా'పద్య నాటకం బంగారు నందిని దక్కించుకుంది. దీంతో పాటు డొక్కా సీతమ్మ, కన్నీటీ కథ సాంఘిక నాటికలకు బంగారు నందులు లభించాయి.
బాలల సాంఘిక నాటికకు బంగారు నంది దక్కింది. 2014 సంవత్సరానికి గాను పద్య నాటకం 'విష్ణు సాహిత్యం' కూడా బంగారు నందిని చేజిక్కించుకుంది. మరో పద్య నాటకం 'నాలుగు గోడల మధ్య'కు బంగారు నంది దక్కింది.