Nandi natakotsavam
-
Nandi Drama Festivals 2023 Pics: గుంటూరులో ఘనంగా ముగిసిన నంది నాటకోత్సవాలు (ఫొటోలు)
-
ముగిసిన నంది నాటకోత్సవాలు
-
కళే శ్వాస..ధ్యాస
ఆయన నాటకంపై మక్కువతో ఆ రంగంలో అడుగుపెట్టారు. పదకొండో ఏటే ఓ నాటక సంఘం స్థాపించి సంచలనం సృష్టించారు. ఈ రంగంలో రాణించడంతో జంద్యాల దృష్టిలో పడి సినీ రంగ ప్రవేశం చేశారు. తనకంటూ పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. నేడు అనారోగ్యం కుంగదీస్తున్నప్పటికీ రంగస్థలంలో దర్శకుడిగా రాణిస్తున్నారు ప్రముఖ రంగస్థల, సినీ నటుడు విద్యాసాగర్. నాటకంపై ఉన్న మమకారంతో తిరుపతిలో జరుగుతున్న నంది నాటకోత్సవాలను తిలకించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో ముఖాముఖి. ప్ర : రంగస్థల ప్రవేశం ఎలా జరిగింది. జ: మా సొంతూరు గుంటూరు. నాకు ఎనిమిదేళ్ల ప్రా యంలో మా ఊళ్లో ఆంధ్ర బాలానందం సంఘం వ్యవస్థాపకుడు రేడియో అన్నయ్య(జ్ఞాపతి రాఘవరావు) చిన్నపిల్లలతో ‘బుజి బుజి రేకుల పిల్లుందా’ మ్యూజికల్ బేరె(డ్రామా) ప్రదర్శన ఇవ్వడానికి వచ్చారు. అందులో నాకో చిన్న పాత్ర దక్కడంతో మొదలైంది రంగస్థల ప్రవేశం. ప్ర: ఏదో సంస్థకు పోటీగా బ్యా నర్ పెట్టారని తెలిసింది. జ : మ్యూజికల్ బేరెలో పెళ్లికొడుకు పాత్ర ఇవ్వమని రేడియో అన్నయ్యను అడిగాను. ఆయన అదిగో ఇదిగో అంటూ ఇవ్వలే దు. దీంతో ఆంధ్రా బాలానందం సంస్థకు పోటీగా నేను 11 ఏటనే శ్రీవెంకటేశ్వర బాలానందం సంఘం స్థాపించాను. మా ఇంటి చుట్టు పక్క ఉన్న పిల్లలతో కలిసి డ్రామాలు వేశాం. రేడియో అన్నయ్య పాత్ర ఇవ్వలేదన్న కసే నన్ను ఇంతవాణ్ణి చేసింది. ప్ర : సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది. జ: 1984లో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి నాటక పోటీ ల్లో ‘లిఫ్ట్’ అనే నాటికను ప్రదర్శించాం. సినీ దర్శకులు జంద్యాల, ఉషాకిరణ్ మూవీస్ మేనేజర్ అట్లూరు రామారావు ఆ పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఆ ప్రదర్శనకు విశేష స్పందన రావడంతో జంద్యాల దర్శకత్వంలో ఉషాకిరణ్ మూవీ స్ మొదటి సినిమా ‘శ్రీవారికి ప్రేమలేఖ’లో అవకాశం ఇచ్చారు. ప్ర : కేవలం నటనతోనే సరిపెట్టారా? జ : నా జీవితమనే నాటకంలో బ్యాంకు ఉద్యోగిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, కోడెరైక్టర్‌గా ఇలా పలు పాత్రలు పోషిం చాను. ఇప్పటి వరకు 102 సినిమాల్లో నటించాను. ఎస్వీ కృష్ణారెడ్డి డెరైక్షన్‌లో బాలకృష్ణ నటించిన టాప్‌హీరో నా ఆఖరు సినిమా. దర్శకుడిగా అవకాశం వచ్చే సమయంలో 1994లో పక్షవాతం రావడంతో సినీ రంగానికి దూరమయ్యాను. అయితే మాతృరంగాన్ని మాత్రం వీడలేదు. ప్ర : నేటి రంగస్థల నటులకు మీ సూచనలు? జ : ఒకప్పట్లో టీవీ వంటి మాధ్యమాలు లేకపోవడంతో నాటక రంగానికి విశేషాదరణ ఉండే ది. దీంతో నాటకమే ఊపిరి, శ్వాసగా జీవించేవాళ్లు. అయితే ఇప్పుడు కొత్తగా నటనారంగంలోకి వస్తున్న వారికి కమిట్మెంట్ కొరవడింది. వచ్చిన రెండ్రోజులకే నంది అవార్డు వస్తుందా? సినిమా, టీవీలో అవకాశాలు ఇప్పిస్తారా? అని అడుగుతున్నారు. ఏదైనా ఒక కళను నమ్ముకుంటే అదే శ్వాస, ధ్యాస కావాలి. అప్పుడే ఆ కళలో గుర్తింపుతోపాటు అగ్రస్థానం దక్కుతుంది. -
ఎన్టీఆర్ ఒక నిమిషం ఆగి ...
తిరుపతి : నాటక రంగం నుంచి సినీ పరిశ్రమకు వచ్చి..ఉన్నస్థాయికి ఎదిగినప్పటికీ తమ మాతృరంగమైన నాటకాన్ని పరుచూరి గోపాలకృష్ణ నేటికీ మరిచిపోలేదు. ఈ నేపథ్యంలో ఆయన తిరుపతిలో జరుగుతున్న నంది నాటకోత్సవాలకు వచ్చి, న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. నాటక రంగం తల్లి వంటిదని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ. ప్ర : నాటక రంగంపై మీ అభిప్రాయం ఏమిటి. జ: మా అన్నదమ్ములు సినీ రంగంలో ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ మాకు పునాది నాటక రంగమే. నాటక రంగం తల్లి వంటిది. అలాంటి తల్లిపాలు తాగిన వారే టీవీ, సినీ రంగంలో సుదీర్ఘకాలం మనుగడ సాధించగలుగుతారు. ప్ర : సినిమాకు,నాటకానికి మధ్య వ్యత్యాసం ఉందా. జ: కచ్చితంగా ఉంది. సినిమా వ్యాపారం, నాటకం కళాత్మకం. సినిమా తీస్తే లాభాల గురించి ఆలోచిస్తారు. పెట్టిన సొమ్ము తిరిగి రాదని తెలిసీ సొంత డబ్బులు పెట్టి నాటకాలు వేస్తారు. నాటకం ద్వారా ఇచ్చే సందేశం నేరుగా ప్రజల్లోకి వెళ్లినా అది కేవలం కొంతమందికే పరిమవుతుంది. సినిమా అలా కాదు. విశ్వవ్యాప్తం కావడంతో సినిమా ప్రభావం ఎక్కువగా ఉంది. ప్ర: సంగీతానికి నంది ఇవ్వాలనే డిమాండ్‌పై మీ అభిప్రాయం. జ: కచ్చితంగా ఇవ్వాల్సిందే. నంది అవార్డుల అభివృద్ధికి ఈ నెల 26న రాష్ట్రస్థాయిలోని అన్ని కళాపరిషత్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి వారి సలహాలు, సూచనలు తీసుకుని ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. అందులోనే సంగీతం, నృత్యం, లలితకళలకు నంది ఇవ్వాలని ప్రతిపాదన చేయనున్నాం. ప్ర: రంగస్థల అభివృద్ధిలో మీ కృషి. జ: నాటక రంగం అభివృద్ధికి పాతికేళ్లలో మా వంతుగా కృషి చేస్తున్నాం. సొంత ఊరైన పల్లెకోనలో సుమారు రూ.కోటితో థియేటర్ నిర్మించి అందులో సొంత మారుతీ ఫిలిమ్స్ బ్యానర్‌పై నాటకరంగాన్ని ప్రోత్సహిస్తున్నాం. నాటక పోటీలను నిర్వహించి కళను ప్రోత్సహిస్తూ, కళాకారులను ఆదరిస్తూ తమ వంతు కృషి చేస్తున్నాం. ప్ర: పరుచూరి బ్రదర్స్ అనే పేరు ఎలా వచ్చింది. జ: ఈ పేరును అన్న ఎన్టీరామారావే పెట్టారు. ఒక రోజు మమ్మల్ని పిలిపించి.. ఏం బ్రదర్, కథలు, మాటలను అన్నదమ్ములిద్దరూ రాస్తున్నారు, మరి సినిమాల్లో పరుచూరి అని ఒకరు పేరు వచ్చేలా ఎందుకు పెడుతున్నారని అడిగారు. లేదు సార్, మేము కూడా అదే ఆలోచిస్తున్నాం. పరుచూరి అండ్ పరుచూరి, లేదా ఇద్దరి పూర్తి పేర్లు పెట్టానుకుంటున్నామని చెప్పాం. వెంటనే ఎన్టీఆర్ ఒక నిమిషం ఆగి పరుచూరి బ్రదర్స్ అని పెట్టుకోండని చెప్పారు. ప్ర: రచయితగా మీ ప్రస్థానం ఎలా మొదలైంది? జ: ఉయ్యూరులోని కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న రోజుల్లో నేను తరగతి గదిలో చెబుతున్న పాఠాలకు విద్యార్థులు చప్పట్లు కొట్టేవారు. దీనిని గమనించిన కళాశాల గవర్నింగ్ బాడీప్రెసిడెంట్ అడుసుమిల్లి విశ్వేశ్వరరావు నన్ను పిలిచి సినిమాలు ఎందుకు చేయకూడదన్నారు. సినిమాలు చేస్తే తప్పకుండా రాణిస్తావని చెప్పి ఆయన కుమారులు నిర్వహిస్తున్న మారుతీ బ్యానర్లో అవకాశమిచ్చారు. ప్ర:ప్రస్తుతం ఏ సినిమాలు చేస్తున్నారు? జ: మహేష్‌బాబు నటిస్తున్న బ్రహ్మోత్సవం, తమిళ సినిమా తని ఒరువన్ తెలుగులో రీమేక్ చేస్తున్న సినిమాకు మాటలు రాస్తున్నాను. -
రాజమండ్రిలో ముగిసిన నంది నాటకోత్సవాలు
రాజమండ్రి:రాష్ట్ర విభజన తరువాత తొలిసారి రాష్ట్రస్థాయిలో రాజమండ్రిలో 16 రోజుల పాటు జరిగిన నంది నాటకోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఈ నంది నాటకోత్సవాల్లో 2013 సంవత్సరానికి గాను 'దేశమును ప్రేమించుమన్నా'పద్య నాటకం బంగారు నందిని దక్కించుకుంది. దీంతో పాటు డొక్కా సీతమ్మ, కన్నీటీ కథ సాంఘిక నాటికలకు బంగారు నందులు లభించాయి. బాలల సాంఘిక నాటికకు బంగారు నంది దక్కింది. 2014 సంవత్సరానికి గాను పద్య నాటకం 'విష్ణు సాహిత్యం' కూడా బంగారు నందిని చేజిక్కించుకుంది. మరో పద్య నాటకం 'నాలుగు గోడల మధ్య'కు బంగారు నంది దక్కింది. -
రాజమండ్రిలో డ్రామాస్కూల్ ఏర్పాటు
-
నంది పండుగా? ఎంపీ వందిమాగధ వేడుకా?
రాజమండ్రి :రాజమండ్రిలో రాష్ర్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాలు ఎంపీ మురళీమోహన్‌కు వందిమాగధ వేడుకల్లా కనిపిస్తున్నాయి. నాటకాల విరామ సమయంలో ఆయన రాజకీయపరంగా మాట్లాడడం, కొందరు నటులను పొగడడం, అక్కడ ఆయన మనుషులే పెత్తనం చేయడంతో ఎంపీ బృందం వ్యవహారంలా నంది నాటకోత్సవాలు కనిపిస్తున్నాయి. చివరకు ఆయన ఎన్నికల్లో ఆటోలో తమ పార్టీ తరఫున మైకు ప్రచారం చేసిన వ్యక్తిని తెచ్చి రాష్ట్రస్థాయి నాటకోత్సవాలకు యాంకర్‌ను చేశారు. ఆ యాంకర్ పరుష పదాలతో మాట్లాడుతుండమేకాక.. కనీసం ఒక్కసారైనా వేదికపై రాజమండ్రి చరిత్ర, నాయకుల వివరాలు వంటివి చెప్పకుండా ఎన్నికల ప్రచారంలా యాంకరింగ్ చేయడంపై ప్రేక్షకులు, నాటకరంగ పెద్దలు, జ్యూరీ సభ్యులు అసహనానికి గురవుతున్నారు. దీనిపై ఒక పెద్దాయన ప్రశ్నిస్తే ఆ కుర్రాడికి శిక్షణ ఇవ్వండని మురళీమోహన్ అన్నారు. ‘ఇప్పుడు ఈ యాంకర్‌కు శిక్షణ ఇవ్వాలా? ఇక్కడ జరుగుతున్నది రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాలేనా?’ అని ఆ పెద్దాయన ముక్కున వేలేసుకున్నారు. కాగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులను తెలుపుతూ ప్రదర్శితమైన ఓ నాటకంలో ఎంపీ పాత్రను ఆకాశానికెత్తుతూ, ఇతర రాజకీయ నాయకులను దుయ్యబట్టారు. ఎంపీ పాత్ర మురళీమోహన్ను పోలి ఉందని, ఇలాంటి నాటకాన్ని ప్రదర్శనకు ఎలా అనుమతించారని పలువురు విస్తుబోయూరు. ఇటువంటి నాటకానికి ఎంపిక చేసే జ్యూరీ ఎందుకు అనుమతి ఇచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా నాటకం ప్రదర్శితమైన తర్వాత వారికి బహుమతులు అందించే సమయంలో ఎంపీ మురళీమోహన్ కొన్ని నాటకాలను ఎక్కువగా పొగుడుతున్నారు. ‘నాటకం బాగుంది. బాగా చేశారు’ అంటూ ప్రశంసిస్తున్నారు. మంగళవారం ఆయన ఇదే విధంగా ఓ నాటకం గురించి మాట్లాడుతుంటే ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు ఎస్.కె. మిశ్రో అభ్యంతరం వ్యక్తం చేశారు. నాటకం ప్రదర్శనపై ఎటువంటి పొగడ్తలను చెప్పవద్దని, అది జడ్జిలను ప్రభావితం చేస్తుందని, తర్వాత ఆ నాటకానికి బహుమతి వచ్చినా వివాదాలకు దారితీస్తుందని అన్నారు. ప్రదర్శనలపై ఎటువంటి కామెంట్లు చేయకూడదనే కనీస విషయం సీనియర్ నటుడైన ఎంపీకి తెలియదా అంటూ పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. కానరాని ఎమ్మెల్యేలు, మేయర్ నాటకోత్సవాల ప్రారంభం రోజున మినహా ఇప్పటివరకు రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మేయర్ పంతం రజనీశేషసాయి నాటకోత్సవాలు జరుగుతున్న ఆనం కళాకేంద్రం వద్ద కనిపించనే లేదు. ఎంపీకి ఇష్టమైన వ్యక్తులకు ప్రాధాన్యమివ్వడం, స్థానిక ప్రజాప్రతినిధులను కలుపుకొని పోకుండా నియంతలా వ్యవహరించడమే దీనికి కారణ మని తెలుస్తోంది. 2008లో జరిగిన నంది నాటకోత్సవాలు రాజకీయ పార్టీలకతీతంగా జరిగాయి. అందరూ సమన్వయంగా పనిచేసారు. ఈసారి టీడీపీ పెత్తనం చేస్తున్న వేడుకలానూ కాక కేవలం మురళీమోహన్ బృందం వ్యవహారంలా జరుగుతున్నాయి. రిలయన్స్ దయా దాక్షిణ్యాలతోనేనా ఆధునికీకరణ? నంది నాటకోత్సవాలను ప్రదర్శిస్తున్న ఆనం కళాకేంద్రం ఆధునికీకరణకు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ రూ.80 లక్షలు, ఆనం ఎలక్ట్రికల్స్ రూ.25 లక్షలు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఎంపీ నిధుల నుంచి రూ.35 లక్షలు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు రూ.15 లక్షలు ఇవ్వగా ఇంకా పలువురు దాతలు సాయం చేశారు. అయితే రిలయన్స్ సంస్థ ఒక్కటే సొమ్ములిచ్చినట్టు ప్రచార బోర్డులను ఏర్పాటు చేశారు. -
హౌస్‌ఫుల్
రాజమండ్రి :రాజమండ్రిలో ఈనెల 16 నుంచి నంది నాటకోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. గత ఆరు రోజులు గా సాగుతున్న నంది నాటకాలు జనరంజకంగా సాగుతున్నాయి. తొలి రెండు రోజులతో పోల్చుకుంటే అనంతరం నాటకాలకు ప్రేక్షకాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. నిర్వాహకులు ఊహించిన దానికన్నా ఎక్కువగా ప్రేక్షకులు నాటకాలను తిలకిస్తున్నారు. పద్య నాటకం, సాంఘిక నాటకం, నాటిక ఏదైనా ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తిలకిస్తున్నారు. సందేశాత్మకంగా, ఉత్కంఠభరితంగా సాగుతున్న నాటకాలు వారిని కట్టిపడేస్తున్నాయి. ఉభయ రాష్ట్రాల నుంచి ప్రముఖ నాటక సమాజాల నాటక, నాటికలు, వాటిలోని నటుల ప్రతిభాపాటవాలు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. చిన్నపిల్లలు చేస్తున్న లఘునాటికలు సైతం ఆకట్టుకుంటున్నాయి. ప్రేక్షకులు అధిక సంఖ్యలో వస్తుండడంతో ఆనం కళాకేంద్రం కిక్కిరిసిపోతోంది. ఉదయం తొలి పద్య నాటకం నుంచి రాత్రి నాటకాలు ముగిసేవరకు వీక్షకుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఆరవరోజు గురువారం మండుటెండలో సైతం నాటకం కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు. వృద్ధులు, మహిళలు, యువతీయువకులు, చిన్నపిల్లలు.. ఇలా అన్నివర్గాల వారు రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. చిన్నపిల్లలను చంకనబెట్టుకుని తల్లులు తరలివస్తున్నారు. ఆనం కళాకేంద్రాన్ని సెంట్రల్ ఏసీ చేయడం వల్ల కూడా ప్రేక్షక హాజరు ఎక్కువగా ఉంటోంది. మధ్యాహ్న సమయంలో ప్రదర్శిస్తున్న సాంఘిక నాటకాల సమయంలో కుర్చీలు సరిపోక చాలా మంది నిల్చునే నాటకాలను వీక్షిస్తున్నారు. సాయంత్రం వేళల్లో కళాకేంద్రం బయట ఏర్పాటు చేసిన ఎల్సీడీ తెరల వద్ద ప్రేక్షకులు పెద్ద ఎత్తున చేరుతున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో కూడా ప్రేక్షకులు తమ కుర్చీలను అంటిపెట్టుకుని ఉండిపోతున్నారు. బయటకు వెళితే సీట్లను ఆక్రమించేస్తారని కర్చీఫ్‌లు, ప్లాస్టిక్ సంచులతో రిజర్వ్ చేసుకుంటున్నారు. కొందరు ఇంటి నుంచి క్యారేజీలు తెచ్చుకుని అక్కడే భోజనాలు కానిచ్చేస్తున్నారు. ముందుముందు హాజరు మరింత పెరిగే అవకాశముందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. 30తోనే ముగియనున్న వేడుక నంది నాటకోత్సవాల్లో నాటకాల ప్రదర్శన ముందు నిర్ణరుుంచిన ప్రకారం ఈనెల 31 వరకూ జరగాలి. ఆ మర్నాడు బహుమతీ ప్రదానం జరగాలి. అయితే జూన్ ఒకటిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉన్నందున నాటక ప్రదర్శనలను 30వ తేదీతో ముగించనున్నారు. అదేరోజు బహుమతీ ప్రదానం జరుగుతుంది. సమయం తగ్గడంతో ఇకపై ప్రతీ రోజూ ఆరు ప్రదర్శనలు జరగనున్నాయి. -
తెర లేచింది..
నదీతీర నగరంలో మరోసారి నవరసాల వరద మొదలైంది. ఏడేళ్ల క్రితం రంగస్థల మహాపర్వానికి వేదికైన ఆనం కళాకేంద్రం మళ్లీ ఆ పండుగ కళతో తుళ్లిపడుతోంది. పలు కారణాలతో వాయిదా పడ్డ 2013, 2014 సంవత్సరాల నంది నాటకోత్సవాలు ప్రారంభమయ్యూయి. 16 రోజుల పాటు 85 ప్రదర్శనలతో వేలమంది కళాకారులు కళాప్రియులకు విందు చేయనున్నారు. రాజమండ్రి :‘సాంస్కృతిక రాజధాని’గా మన్నన పొందే రాజమండ్రిలో పదహారురోజుల కళాపర్వానికి తెరలేచింది. రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 16 రోజులు జరిగే 2013, 2014 నంది నాటకోత్సవాలు స్థానిక శ్రీ వేంకటేశ్వరా ఆనం కళాకేంద్రంలో శనివారం ప్రారంభమయ్యయి. ‘వీరాభిమన్యు’ పద్యనాటకంతో ప్రారంభమైన ఈ వేడుకలో తొలిరోజు మరో మూడు సాంఘిక నాటక, నాటికలు ప్రదర్శితమయ్యూయి. ప్రారంభోత్సవ కార్యక్రమం ఆలస్యం కావడంతో ఉదయం మొదలు కావాల్సిన నాటకాల ప్రదర్శనలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆరంభమయ్యాయి. ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథులు హాజరు కావాల్సిన ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాలేదు. దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మాగ ంటి మురళీమోహన్ వేడుకను లాంఛనంగా ఆరంభించారు. ఆశించిన స్థాయిలో రాని ప్రేక్షకులు 2008లో రాజమండ్రిలో తొలిసారి నంది నాటకోత్సవాలను నిర్వహించారు. ప్రస్తుతం ఆధునికీకరించిన ఆనం కళాకేంద్రంలో రెండు సంవత్సరాల ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. కాగా తొలిరోజు ప్రదర్శనలలో అడుగడుగునా ఆధునికత ఉట్టిపడింది. కళాకేంద్రాన్ని సెంట్రలైజ్డ్ ఏసీ చేయడంతో చల్లని వాతావరణంలో ప్రేక్షకులు నాటకాన్ని వీక్షించారు. తొలి రోజు నాటకాలు, నాటికల ప్రదర్శనకు ప్రేక్షకులు బాగానే వచ్చినా నిర్వాహకులు ఆశించిన స్థాయిలో లేరనే చెప్పాలి. కళాకేంద్రం వెలుపలు భారీ ఎల్సీడీ తెరలు ఏర్పాటు చేసినా అక్కడ సౌండ్ సిస్టం ఏర్పాటు చేయకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది. నంది నాటకోత్సవానికి సంబంధించి బ్రోచర్లను వేదిక మీద విడుదల చేసే వరకు ఇవ్వకపోవడం గమనార్హం. తొలి నుంచీ మన రాష్ట్ర పరిధిలోని నాటక సమాజాలు మాత్రమే ప్రదర్శనలు ఇస్తాయని నిర్వాహకులు చెప్పుకుంటూ వచ్చినా తెలంగాణా ప్రాంత నాటక సమాజాలు కూడా రావడం గమనార్హం. హైదరాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం నుంచి సమాజాలు నాటక ప్రదర్శనలకు వచ్చాయి. తొలి రోజు ప్రదర్శనల్లో సుమారు 100 మంది నటీనటులు పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. ప్రదర్శనలకు వేదికైన ఎన్టీఆర్ కళా ప్రాంగణ రంగురంగుల విద్యుత్‌దీపాలు వెలుగులు, సెట్టింగ్‌లతో ప్రేక్షకులను మైమరిపించింది. సెట్టింగ్‌లు ప్రదర్శనలకు సహజత్వాన్ని సంతరించాయి. లోపాలున్నా ప్రారంభం ఘనమే.. తొలి రోజు ప్రదర్శించిన ‘వీరాభిమన్యు, ఇది ప్రశ్న.. ఏది జవాబు?, హంస కదా నా పడవ, దొంగలు’ నాటక, నాటికలు ప్రేక్షకులను రంజింప చేశాయి. నటుల ప్రతిభ పరాకాష్టకు చేరిన సన్నివేశాల్లో ప్రేక్షకుల కరతాళధ్వనులు మార్మోగారుు. చిన్నాచితకా సమస్యలు, లోపాలు ఉన్నా మొత్తం మీద నంది పండుగ రాజమండ్రిలో మరో బృహత్ సాంస్కృతిక ఘట్టంగా అట్టహాసంగా ప్రారంభమైందనే చెప్పాలి. -
రాజమహేంద్రిలో‘నంది’ సందడి
(లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి) :రాజరాజ నరేంద్రుడు ఏలిన రాజమహేంద్రి అంటేనే కళలకు, కళాకారులకు పెట్టింది పేరు. ఎందరో మహానుభావులను కళారంగానికి పరిచయం చేసి కళామతల్లికి నీరాజనాలు పలికింది ఈ నగరం. ఎక్కడెక్కడి బంధువులో పెద్ద పండుగకు పుట్టింటికి వచ్చినట్టుగా నంది నాటకోత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కళాకారులు తరలివచ్చారు. రాష్ట్ర విభజన తరువాత తొలిసారి రాష్ట్రస్థాయిలో రాజమండ్రిలో 16 రోజుల నంది నాటకోత్సవాలకు శనివారం శ్రీకారం చుట్టారు. ఇందుకోసమే రాజమండ్రి ఆనం కళాకేంద్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విభజనకు ముందు హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే నాటకోత్సవాల విభజన తరువాత రాజమండ్రికి మారాయి. ఆంధ్రాలో సినీ పరిశ్రమకు రాజమండ్రి కేంద్రం కావాలని నాటకోత్సవాలకు హాజరైన పలువురు కళాకారుల అభిలాష. అందుకు ఈ నంది నాటకోత్సవాలే నాంది కావాలని ఆకాంక్షిస్తున్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే నాటకోత్సవాలను తలదన్నే రీతిలో ఆతిథ్యం, ఆదరణ ఉండేలా ఈ 16 రోజులు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పుష్కర పనులను పరిశీలించిన గవర్నర్ ఈ వారం ప్రారంభంలో రాష్ట్ర గవర్నర్ ఎం.ఎల్.నరసింహన్ విభజన తరువాత జిల్లాకు తొలిసారి వచ్చారు. రాజమండ్రిలో పుష్కర పనులను పరిశీలించిన గవర్నర్ అధికారులను పరుగులు పెట్టించారు. ప్రతీ పనిపై ఆరా తీశారు. భద్రతకు సంబంధించి సూచనలు చేశారు. కోరుకొండ లక్ష్మీనరిసింహస్వామిని దర్శించుకున్నారు. తన సతీమణి ముచ్చటపడ్డ జాంధానీ చీరలను ఉప్పాడ వెళ్లి మరీ కొనిపెట్టారు. పుష్కర పనుల్లో వేగం పెంచాలన్న గవర్నర్ మాటను ఎంతవరకు నిలబెడతారో వేచి చూడాల్సిందే. పనిలో పనిగా జేఎన్టీయూకేలో వివాదాస్పదంగా మారి, తరచు ఫిర్యాదులు వస్తోన్న గ్లోబరీనా ఒప్పందంపై వీసీ వీఎస్ఎస్ కుమార్‌ను సుమారు గంటపాటు ఆరా తీసి వెళ్లారు. చాన్సలర్ హోదాలో ఆ ఒప్పందంపై సమగ్ర నివేదికను వెంట తీసుకువెళ్లి ఉంటారని భావిస్తోన్న వర్సిటీ వర్గాలు ఆయన తీసుకోబోయే చర్యల కోసం ఉత్కంఠగా నిరీక్షిస్తున్నారు. రెండోసారి పర్యటించిన సీఎం చంద్రబాబు వరుసగా రెండో వారం సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు వచ్చారు. గత హామీలనే తిరిగి వేట్లపాలెం సభలో వినిపించడం జనానికి విసుగెత్తించేలా చేసింది. ప్రకటనలకే పరిమితమైన ప్రాజెక్టులను మరోసారి నొక్కి చెప్పిన బాబు కొంతలో కొంత ఊరటనిచ్చే అంశాలు కొన్నింటిని ప్రస్తావించారు. జిల్లాలో అన్ని పంచాయతీల్లో రోడ్లు, డ్రైన్ల అభివృద్ధికి రూ.200 కోట్లు, ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.137కోట్లు, పిఠాపురం బ్రాంచ్ కెనాల్‌కు రూ.11 కోట్లు మంజూరు చేశామని చెప్పి వెళ్లారు. అలాగే కొత్తగా కాకినాడలో మరోపోర్టు, పెట్రో వర్సిటీ కాకినాడలో ఏర్పాటు చేసి, ఈ విద్యా సంవత్సరం నుంచే క్లాసులు ప్రారంభిస్తామని చెప్పడం కొంతలో కొంత జిల్లావాసులకు ఉపశమనం కలిగించాయి. ఇన్చార్జి మంత్రిగా దేవినేని ఈ వారం అధికారికంగా మరొక ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది సమీపిస్తున్న తరుణంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రిని ప్రకటించారు. తొలుత మంత్రి శిద్ధా రాఘవయ్య పేరును తెరమీదకు తెచ్చిన సర్కారు చివరి నిమిషంలో ఆయనను కాదని ఆ బాధ్యతలు మంత్రి దేవినేనికి అప్పగించింది. వివాదాస్పద పట్టిసీమ, పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు వంటి ముఖ్యమైన ప్రాజెక్టులు కలిగి ఉండడంతో జిల్లాకు జలవనరుల శాఖామాత్యులనే ఇన్చార్జ్ మంత్రిగా నియమించారు. ఈ నియామకంతో జిల్లాకు ఏమేరకు ప్రయోజనం చేకూరుతుందనేది చూడాల్సిందే. ఏసీబీకి చిక్కిన ఆర్డీ రాజేంద్రప్రసాద్ మున్సిపల్ రీజనల్ డెరైక్టర్ రాజేంద్రప్రసాద్ లంచం తీసుకుంటూ పట్టుబడడం జిల్లా అధికార యంత్రాగాన్ని ఉలిక్కిపడేట్టు చేసింది. పెడన మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ నుంచి రూ.50డ వేల లంచం తీసుకుంటూ పట్టుబడడంతో రాజమండ్రిలోని ఆయన ఇంట్లో సోదాలు చేసి పలు రికార్డులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. మున్సిపల్ పరిపాలనాపరంగా అవినీతికి తావులేకుండా సమర్థంగా పనిచేయాలంటూ ప్రతీ సమీక్ష సమావేశాల్లో అధికారులందరికీ క్లాసులు తీసుకునే ఆర్డీ రాజేంద్రప్రసాద్ స్వయంగా కింది స్థాయి ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. క్రమంగా పెరుగుతున్న ఎండలతో వేగిపోతున్న జిల్లాకు వారం చివరిలో ఉపశమనం కలిగింది. శుక్ర, శనివారాలు జిల్లాలో పలు చోట్ల మంచి వర్షాలు కురిశాయి. -
రాజమండ్రి కేంద్రంలో నంది నాటకోత్సవాలు