ఓటరుకూ ఓ రోజు! | National Voters' Day | Sakshi
Sakshi News home page

ఓటరుకూ ఓ రోజు!

Published Sun, Jan 25 2015 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM

ఓటరుకూ ఓ రోజు!

ఓటరుకూ ఓ రోజు!

 విజయనగరం మున్సిపాలిటీ: ‘ఓటరు మహాశయులారా...’ అని ఐదేళ్లకు ఓ మారే నాయకులు పిలుస్తుంటారని ప్రజలు తెగ బాధపడిపోతుంటారు. కానీ ఓటరు మహాశయులకూ ఓ రోజుంది. ఏటా జనవరి 25నభారత ఎన్నికల సంఘం జాతీయ ఓ టరు దినోత్సవం ఘనంగా నిర్వహిస్తోంది. ఏ టా 18 ఏళ్ల నిండిన యువతను ఓటరుగా న మోదు చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలను కూ డా చేపడుతోంది.  
 
 తొలి ఓటు హక్కు...
 1950 జనవరి 25 మొట్టమొదటి సారిగా దేశం లో ప్రజాస్వామ్య పద్ధతిలో పౌరుడికి తొలి సారి గా ఓటు హక్కు కల్పించారు. 1952 మొట్ట మొ దటి సారి నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట రు జాబితా ఆధారంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1992 వరకు ఎలక్ట్రో ఫోటో ఐ డెంటిటీ కార్డు ఉండేది కాదు. 1993లో భారత ఎన్నికల సంఘం కమిషనర్‌గా ఉన్న టీఎన్ శేషన్ ఓటర్ల గుర్తింపు కార్డుల ప్రక్రియను ప్రారంభించారు.
 
 ఓటరు దినోత్సవం వచ్చిందిలా...
 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఏర్పడింది. 2010 నాటికి ఎన్నికల సంఘం 60 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 2011 జనవరి 25వ తేదీన తొలి జాతీయ ఓటరు దినోత్సవంగా నిర్వహించాలని భారత ఎ న్నికల సంఘం ప్రకటించింది. తర్వాత 2012లో రెండో జాతీయ ఓటర్ల దినోత్సవం, 2013, 2014 సంవత్సరాల్లో మూడు, నాల్గవ జాతీయ ఓటర్ల దినోత్సవాలు జరుపుకున్నాం.
 
 ఓటు  ‘ఇ’లా ఈజీ!
 విజయనగరం మున్సిపాలిటీ : ఓటు... ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి విలువైన, బ ల మైన ఆయుధం. ఓటు హక్కు పొందడానికి ఎన్నికల కమిషన్ విస్తృత మార్గాల ను చూపిస్తోంది. మీ సేవా కేంద్రా లు, పోస్టాఫీసు, బ్యాంకుల్లో దరఖాస్తులు అందుబాటులో ఉంచుతున్నారు. ఓటు కోసం ఆన్‌లైన్‌లో కూ డా ఈ-రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది చాలా సులభమైన పద్ధతి. కొత్త ఓటర్లు గా చేరేవారు ఫారం6ను సవివరంగా నింపినా కొన్ని తిరస్కరణకు గురైన సం దర్భాలుంటాయి. ఓటరు కార్డు కావాల ని మరోసారి దరఖాస్తు చేసేందుకు సయమాన్ని వెచ్చించినా వచ్చేంత వరకు అనుమానమే. దీన్ని అధిగమించేందుకు ఉన్న ఏకైక అస్త్రం ఈ-రిజిస్ట్రేషన్. నెట్‌ద్వారా నమోదు చేసుకునే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించింది. ఆన్‌లైన్ ద్వారా పది హేను నిమిషాల్లోనే దరఖా స్తు ఎన్నికల సంఘానికి పంపించవచ్చు. నమోదు చేసుకున్న తర్వాత ఎన్నికల సంఘం నుంచి వచ్చే ఐడీ నెంబర్ ద్వారా దరఖాస్తు పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. సందేహాలుంటే 1950కి ఫోన్ చేయవచ్చు. 

 నమోదు ఇలా....

 ఊ వెబ్‌పేజీ ఓపెన్ చేసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సిఈఓఆంధ్రా.ఎన్‌ఐసి.ఇన్ వెబ్ అడ్రస్ టైప్ చేస్తే ఎన్నికల సంఘం హోంపేజీ ఓపెన్ అవుతుంది.
 ఊ ఆ తర్వాత పైన వరుసలో కనిపించే బార్‌లో ఈ-రిజిస్ట్రేషన్ ఉంటుంది. దానిపై మౌస్‌తో క్లిక్ చేయగానే నాలుగు రకాల ఫారాలు కనిపిస్తాయి. అందులో ఫారం-6 (న్యూ ఎన్‌రోల్‌మెంట్) కొత్త ఓటరు నమోదును ఎంచుకోవాలి.
 ఊ అనంతరం మరో విండోలో రిజిస్ట్రేషన్ చేసుకునేందకు ఫారం-6 ఓపెన్ అవుతుంది.
 ఊ అంతకుముందే పాస్‌పోర్ట్ ఫోటోను స్కాన్‌చేసి కంప్యూటర్‌లో భద్రపరుచుకోవాలి. ఫోటో వెడ ల్పు, పొడవులు 240, 320గా పెట్టుకుని 100 కేబీ మించకుండా చూసుకోవాలి. ఫోటో బ్రౌజ్ అన్న చోటక్లిక్ చేసి అప్‌లోడ్ చేయాలి
 ఊ పేరు, చిరునామా, ఇతరత్రా వివరాలు ఫారం లో ఇంగ్లిష్‌లో నమోదు చేయాలి. అన్నీ పూర్తయ్యాక ఫారం చివరిలో ఉన్న ట్రాన్స్‌లేట్ బట న్‌ను క్లిక్ చేస్తే ఫారంలో మనం ఇంగ్లీషులో నమో దు చేసిన వివరాల కింద తెలుగు పదాలు వస్తా యి. ఆ తరువాత సబ్‌మిట్ బటన్‌పై ప్రెస్ చేయాలి.
 
 ఊ సబ్‌మిట్ చేసిన తరువాత మీకు ఫొటోతో సహా వివరాలతో కూడిన ఐడీ నంబర్ వస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. మెయిల్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఐడీ నంబర్‌తో ఎప్పటికప్పుడు కార్డు స్టేట స్ తెలుసుకోవచ్చు.
 
 ఇవీ వివరాలు...
 విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో ఈ ఏడాది 17,410 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నా రు. ఇందులో మహిళలు 9307 మంది ఉండగా పురుషులు 8093 మంది ఉన్నారు. వీరితో పాటు ఇతరులు పది మంది నమోదయ్యారు. దీంతో జిల్లాలోని కొత్తగా నమోదైన వారితో కలిపి ఓటర్ల సంఖ్య 17,31,610కు చేరింది.
 
 గత ఏడాది నుంచీ హిజ్రాలకు ప్రాధాన్యం...
 జిల్లాలో హిజ్రాలకు ఓటర్లుగా గుర్తింపునివ్వడం గత ఏడాది నుంచి ప్రారంభమైంది. అప్పటి కలెక్టర్ కాంతిలాల్ దండే దీనిపై దృష్టి సారించి జిల్లాలో వంద మందికి పైగా హిజ్రాలకు ఓటరు నమోదు చేయించారు. అంతే కాకుండా వారికి జాతీయ ఓటరు దినోత్సవం రోజున ఓటరు గుర్తింపు కార్డులిచ్చారు. అంతే కాకుండా వారు కూడా ఓటరు నమోదు ప్రాధాన్యతను తెలియజేస్తూ ర్యాలీలు నిర్వహించి చైతన్య పరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం జిల్లాలో 143 మంది హిజ్రా ఓటర్లున్నారు.

 ఏ దరఖాస్తు దేనికంటే....
 ఫారం 6: చేర్పులు
 ఫారం 6ఏ: ఎన్నారైల చేర్పులు
 ఫారం7: తొలగింపులు
 ఫారం 8: సవరణలు
 ఫారం8ఏ: బదిలీలు
 జనాభా నిష్పత్తిని
 
 దాటిపోయిన ఓటర్లు:
 జిల్లాలో ఓటర్లు జనాభా నిష్పత్తిని దాటిపోయారు. వాస్తవానికి ఏ ప్రాంతంలోనైనా అక్కడ ఉన్న జనాభాకు 65 శాతం మాత్రమే ఓటర్లుండాలి. అంటే ప్రతి వెయ్యి మంది జనాభాకూ 650 మంది ఉండాలి. కానీ జిల్లాలో మాత్రం ప్రతి వెయ్యి మంది జనాభాకూ 726.5 మంది ఓటర్లున్నారు. చాలా ప్రాంతాల్లో వయసు తక్కువ వారిని కూడా ఓటర్లుగా స్థానిక రాజకీయ లబ్ధి కోసం చేర్చడంతో పాటు చనిపోయిన, వలస పోయిన వారి ఓట్లను తొలగించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీనిపై ఎన్నికల సంఘానికి జిల్లా అధికారులు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులున్నాయి. జిల్లా జనాభా 2015 అంచనాల ప్రకారం 23,83,505 మంది ఉంటే ఓటర్లు 17,31,610 మంది ఉన్నారు.
  ఓటరు ఐడెంటిటీ కార్డు పొందాలంటే మీ సేవలో రూ.10 చెల్లిస్తే సరిపోతుంది.
  మెటల్‌తో తయారు చేసిన కలర్ కార్డు కావాలంటే రూ.25 చెల్లించి మీ సేవలో పొందవచ్చు.
 
 యువత ఆసక్తి చూపుతున్నారు
 జిల్లాలో ఉన్న యువత ఓటరుగా నమోదు చేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆ న్‌లైన్‌లో ఎక్కువగా దరఖాస్తు చేసుకుంటున్నా రు. నమోదుకు ఎల్లప్పుడూ అవకాశం ఉంటుం ది కనుక అర్హత కలిగిన యువత నిరంతరం ఓటరు నమోదుకు తగిన వయసు రాగానే రి జిస్ట్రేషన్ చేయించుకోవాలి. అదే సమయంలో చనిపోయిన, వలస పోయిన వారి ఓట్లు తొ లగించేందుకు ముందుకు రావాలి. తిరిగి వచ్చి న వారి ఓట్లు నమోదుకు కూడా సహకరించాలి
  - వై.రాధాకృష్ణ వాణి, సూపరింటెండెంట్, ఎన్నికల సెల్, విజయనగరం కలెక్టరేట్
 
 ప్రత్యేక డ్రైవ్‌లు...
 జిల్లాలో ఓటరు నమోదుకు ఎలాగైతే ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తామో ఎన్నికల సమయంలో కూడా అదేవిధంగా డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాం. దీని వల్ల మంచి నాయకులను ఓటర్లు ఎన్నుకునే అవకాశం లభిస్తుంది. ఓటరుగా నమోదు చేయించుకోవడం ఎంత బాధ్యతో మంచి నీ తివంతమయిన పాలకుడ్ని ఎంచుకోవడం కూడా అంతే బాధ్యతగా ప్రతి ఓటరూ గుర్తెరగాలి. ఓటు నమోదు చేసుకోవడానికి అర్హులు ముందుకు రావాలి.
            - వై.నరసింహారావు, డీఆర్వో, విజయనగరం
 
 ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటే కీలకం
 భారత ప్రజాస్వామ్య ప్రభుత్వ వ్యవస్థకు కీల కం ఓటు హక్కు. దీన్ని ప్రతి పౌరుడూ గుర్తించాలి. వయోజనుడైన ప్రతి ఒక్క ఓటరూ తన ఓటు హక్కును సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి. ఓటర్లు స్వేచ్ఛగా తమ నాయకుడిని ఎన్నుకునే అవకాశాన్ని అధికార యంత్రాంగం తప్పకుండా కల్పిస్తుంది. నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి దోహదపడే ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని విజ్ఙప్తి.
 - బి.రామారావు, జాయింట్ కలెక్టర్,
  విజయనగరం
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement