సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశపరీక్ష(నీట్)ను నేడు(ఆదివారం) నిర్వహించనున్నారు. ఏపీలో 49,210 మంది, తెలంగాణలో 50,856 మంది నీట్ రాస్తున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగు తుంది.
అభ్యర్థులు పరీక్ష కేంద్రాల లోపలికి ఉదయం 7.30 నుంచి 9.30 లోపు చేరుకోవాలి. ఆ తర్వాత వచ్చినవారిని అనుమతించరు. దేశవ్యాప్తంగా 13,26,725 మంది పరీక్షకు హాజరవుతున్నారని సీబీఎస్‌ఈ తెలిపింది.
నిబంధనలివే..
నిబంధనల మేరకు అభ్యర్థులు ఎలాంటి ఆభరణాలు ధరించకూడదని, రింగులు, చైన్‌లు, వాచీలు నిషిద్ధమని అధికారులు చెప్పారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువు (ఫోన్లు, ట్యాబ్‌లు, బ్లూటూత్‌లు, కాలిక్యులేటర్లు)లను అనుమతించబోమని వెల్లడించారు. అమ్మాయిలు జడ వేసుకుని పరీక్షకు రావాలని పేర్కొన్నారు.
అబ్బాయిలు ఫార్మల్ డ్రెస్‌లో రావాలని బిగుతుగా ఉన్న జీన్స్ ధరించకూడదన్నారు. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా బూట్లు ధరించి పరీక్షకు రాకూడదని తెలిపారు. పరీక్ష రాయడానికి పెన్ను, పెన్సిల్‌ను కూడా నిర్వాహకులే ఇస్తారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment