రూ. 4.5 కోట్లతో నూతన కోర్టు
గిద్దలూరు: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కోర్టు భవనాన్ని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్. శేషసాయి, జస్టిస్ సులేన్‌చౌదరిలు ప్రారంభించారు. శనివారం ప్రారంభించిన ఈ భవనంలో జూనియర్ సివిల్ కోర్టు, జూనియర్ క్రిమినల్ కోర్టులున్నాయి. ఈ భవనాన్ని రూ. 4.5 కోట్ల వ్యయంతో నిర్మించారు.