శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో బీఎస్సీ నర్సింగ్ కాలేజీ, గుంటూరులో ప్రభుత్వ సర్వజనాసుపత్రికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
హైదరాబాద్ : శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో బీఎస్సీ నర్సింగ్ కాలేజీ, గుంటూరులో ప్రభుత్వ సర్వజనాసుపత్రికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన భవనాల నిర్మాణానికి రూ.40 కోట్లను మంజూరు చేసింది. శ్రీకాకుళంలో బీఎస్సీ నర్సింగ్ కాలేజీ, గుంటూరులో ప్రభుత్వ సర్వజనాసుపత్రికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖ డెరైక్టర్ జూలై 28న సర్కారుకు ప్రతిపాదనలు పంపారు.
వీటిపై ఆమోదముద్ర వేసిన ప్రభుత్వం శ్రీకాకుళంలో బీఎస్సీ నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకు రూ.20 కోట్లు, గుంటూరు సర్వజనాసుపత్రిలో నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకు మరో రూ.20 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.