గుంటూరు జిల్లాలోని వేమూరు మండలం కొల్లూరులో గత అర్థరాత్రి దోపిడి దొంగలు స్వైర విహారం చేశారు. పట్టణంలోని 10 షాపుల్లో చోరీ చేసి, భారీగా సొత్తును అపహరించారు. శనివారం ఉదయం షాపు యజమానులు తమ దుకాణాల్లో దోపిడి జరిగిందని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు.
దాంతో పోలీసుల చోరీకి గురైన షాపులను పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. గుంటూరు జిల్లాలో రేపల్లి పట్టణంలో గురువారం అర్థరాత్రి దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. దాదాపు 10 షాపులను లూటీ చేశారు. దాంతో షాపు యజమానాలు రేపల్లె పోలీసులను ఆశ్రయించారు. పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి మండలం శ్రీరాంపురంలో గత రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా మూడిళ్లలో చోరీకి పాల్పడ్డారు. 10 తులాల బంగారంతోపాటు రూ.3 లక్షల నగదును దోపిడి దొంగలు దోచుకుపోయారు. దాంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.