
నేటి నుంచి నూతన బడి వేళలు
చిత్తూరు(ఎడ్యుకేషన్) : ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వేళలు మారుస్తూ పాఠశాల విద్య డెరైక్టర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. నూతన బడి వేళలను శనివారం నుంచి పాటిం చాలని జిల్లా విద్యాశాఖాధికారి మండల విద్యాశాఖాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పాఠశాలల్లో టైంటేబుల్ ఇలా ఉంటుంది.
ప్రాథమిక పాఠశాలల్లో: ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 9 నుంచి 9.15 గంటల వరకు ప్రార్థన, మొదటి పీరియడ్ 9.15 నుంచి 10, రెండో పీరియడ్ 10.10 నుంచి 10.40, ఇంటర్వెల్ 10.40 నుంచి 10.50, మూడో పీరియడ్ 10.50 నుంచి 11.30, నాలుగో పీరియడ్ 11.30 నుంచి 12.10, మధ్యాహ్న భోజన విరామం 12.10 నుంచి 1.10 వరకు, ఐదో పీరియడ్ 1.10 నుంచి 1.50, ఆరో పీరియడ్ 1.50 నుంచి 2.30, ఏడో పీరియడ్ 2.40 నుంచి 3.20, ఎనిమిదో పీరియడ్ 3.20 నుంచి నాలుగు గంటల వరకు. ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరగాలి. మొత్తం టైంటేబుల్ ప్రాథమిక పాఠశాలల టైంటేబుల్ మాదిరిగానే ఉంటుంది. కాకపోతే 4 నుంచి 4.30 గంటల వరకు 9వ పీరియడ్ ఉంటుంది.
హైస్కూళ్లలో: ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. 9 నుంచి 9.15 గంటల వరకు ప్రార్థన, మొదటి పీరియడ్ 9.15 నుంచి 10, రెండో పీరియడ్ 10.10 నుంచి 10.40, మూడో పీరియడ్ 10.40 నుంచి 11.20, ఇంటర్వెల్ 11.20 నుంచి 11.30, నాలుగో పీరియడ్ 11.30 నుంచి 12.10, ఐదో పీరియడ్ 12.10 నుంచి 12.50, మధ్యాహ్న భోజన విరామం 12.30 నుంచి 1.40 వరకు, ఆరో పీరియడ్ 1.40 నుంచి 2.20, ఏడో పీరియడ్ 2.20 నుంచి 3.00, ఇంటర్వెల్ 3.00 నుంచి 3.10, ఎనిమిదో పీరియడ్ 3.10 నుంచి 3.50, తొమ్మిదో పీరియడ్ 3.50 నుంచి 4.30 వరకు జరుగుతుంది.