ఇదేమి... స్వామీ! | next Assembly elections no Contest Virabhadrasvami | Sakshi
Sakshi News home page

ఇదేమి... స్వామీ!

Published Tue, Jan 14 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM

next Assembly elections no Contest Virabhadrasvami

సాక్షి ప్రతినిధి, విజయనగరం :రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ప్రకటించడం వెనుక ఒత్తిడి ఏమైనా ఉందా? టిక్కె ట్ ఆశించి భంగపడడం కంటే ముందుగానే రేసులోంచి తప్పుకోవడమే మంచిదనుకున్నా రా? యడ్ల రమణమూర్తికి లైన్‌క్లియర్ చేసేందు కు పీసీసీ అధ్యక్షుడు బొత్స వ్యూహా త్మక ఎత్తుగడ వేశారా? అందులో చిక్కుకునే ఏఐసీసీ పరి శీలకుడి ముందు కోలగట్ల ఈ ప్రకటన చేశా రా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. బొత్స నీడలో ఉండగా కోలగట్ల వీరభద్రస్వామి గెలవలేరలేన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటివరకూ ప్రతి ఎన్నికల్లోనూ కోలగట్ల ఓటమి చవిచూశారు. ఎందుకలా జరిగిందో ఆయనకు తెలిసే ఉండొ చ్చు. ఆయన చెప్పకపోయినా ఉన్న సత్యమేంటో అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే బొత్సకు దూరమైన తరువాత జరిగిన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు గెలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయబావుటా ఎగురవేశారు. మారిన రాజకీయ పరిణామాల తో బొత్సతో కలిసి కోలగట్ల పనిచేస్తున్నారు. కానీ ఎప్పుడైనా ఏకు మేకై కూర్చొంటారన్న భయంతో ప్రత్యామ్నాయంగా టీడీపీ నుంచి యడ్ల రమణమూర్తిను బొత్స తీసుకొచ్చారు.
 
 దీంతో  సీన్ అర్థమైందని, కథ మళ్లీ మొదటికొచ్చిందన్న భావన కో లగట్లకు ఎరుకైందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ వైపు చూస్తున్నారన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. అరుుతే ‘ఒక లీడర్ వెళ్లిపో తే పీసీసీ అధ్యక్షుడు హోదాలో అవమానమన్న భావనతో ఒకవైపు, అసెంబ్లీ ఎన్నికల్లో యడ్ల రమణమూర్తికి లైన్ క్లియర్ చేయవచ్చని మరో వైపు ఆలోచించి కోలగట్లకు ఎమ్మెల్సీ పోస్టును కట్టబెట్టారు’ అన్న వాదన కూడా ఉం ది. మొత్తానికి రాజీ వాతావరణం మధ్య అటు కోలగట్ల, ఇటు బొత్స కొనసాగుతున్నారు. యడ్లను తెరపైకి తెస్తున్నారు.
 
 ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి జిల్లాకు వచ్చిన ఏఐసీసీ సభ్యుడు జీఎం ఆవారి, పీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.వి.రావుల ముందు కొంతమంది నాయకుల్ని వ్యూహాత్మకంగా బొత్స బరిలోకి దించి యడ్ల రమణమూర్తి పేరును ప్రతిపాదించినట్టు తెలిసింది. ఇదంతా గమనించే పోటీ నుంచి తప్పుకున్నట్టు కోలగట్ల ప్రకటించారన్న వార్తలు వినిపించాయి. ముఖ్యనేత మదిలో ఒక పేరు ఉండగా పోటీ చేస్తానని ప్రకటిస్తే భవిష్యత్‌లో గత పరిణామాలు పునరావృతమవుతాయని, రేసులో ఉండడం కంటే తప్పుకోవడమే మం చిదన్న నైరాశ్యంతో ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనంటూ కోలగట్ల ప్రకటించి ఉంటారని విసృ్తత చర్చ జరుగుతోం ది. మొత్తానికి బొత్స వేసిన ఎత్తుగడకు కోలగట్ల బోల్తా పడ్డారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement