virabhadrasvami
-
అంగరంగ వైభవం.. వీరభద్రస్వామి రథోత్సవం
గుమ్మఘట్ట మండలం తాళ్లకెరలో బుధవారం అశేష భక్తజనం నడుమ వీరభద్రస్వామి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పలువురు పీఠాధిపతులు, వేదపండితుల ఆధ్వర్యంలో వేకువ జామునే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని రాష్ట్ర వీరశైవ సంఘం అధ్యక్షులు, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గ్రామస్తులతో కలసి పల్లకీలో ఊరేగింపుగా తీసుకొచ్చి రథంపై కొలువుదీర్చారు. రథోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు కర్ణాటక నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రేవణ సిద్ధేశ్వర ట్రస్ట్ సభ్యులు అన్నదానం తో పాటు భక్తులకు సౌకర్యాలు కల్పించారు -
రెండు ఆలయాల్లో చోరీ
చింతకొమ్మదిన్నె: మండలంలోని గంగమ్మతోపు ఆవరణలోని సాయిబాబా, వీరభద్రస్వాముల ఆలయాల్లో శనివారం అర్ధరాత్రి హుండీల్లోని నగదును దుండగులు చోరీ చేశారు. సాయిబాబా ఆలయానికి ఉన్న తలుపుల గడియకు ఉన్న తాళాన్ని పగులగొట్టి హుండీని బయటికి ఎత్తుకెళ్లారు. హుండీ తాళాలు పగులగొట్టి నగదు దోచుకెళ్లారు. అలాగే సమీపంలోని వీరభద్రస్వామి ఆలయంలో ఉన్న పురాతన హుండీ తాళాలను పగులగొట్టి అందులోని సొమ్మును కాజేసినట్లు ఆలయ ధర్మకర్తలు చిన్న ఓబన్న, లింగారెడ్డి పేర్కొన్నారు. రెండు ఆలయాల్లో రూ. 50 వేలు దోచికెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆదివారం సీకే దిన్నె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఏఎస్ఐ దస్తగిరి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. -
ఇదేమి... స్వామీ!
సాక్షి ప్రతినిధి, విజయనగరం :రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ప్రకటించడం వెనుక ఒత్తిడి ఏమైనా ఉందా? టిక్కె ట్ ఆశించి భంగపడడం కంటే ముందుగానే రేసులోంచి తప్పుకోవడమే మంచిదనుకున్నా రా? యడ్ల రమణమూర్తికి లైన్‌క్లియర్ చేసేందు కు పీసీసీ అధ్యక్షుడు బొత్స వ్యూహా త్మక ఎత్తుగడ వేశారా? అందులో చిక్కుకునే ఏఐసీసీ పరి శీలకుడి ముందు కోలగట్ల ఈ ప్రకటన చేశా రా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. బొత్స నీడలో ఉండగా కోలగట్ల వీరభద్రస్వామి గెలవలేరలేన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటివరకూ ప్రతి ఎన్నికల్లోనూ కోలగట్ల ఓటమి చవిచూశారు. ఎందుకలా జరిగిందో ఆయనకు తెలిసే ఉండొ చ్చు. ఆయన చెప్పకపోయినా ఉన్న సత్యమేంటో అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే బొత్సకు దూరమైన తరువాత జరిగిన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు గెలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయబావుటా ఎగురవేశారు. మారిన రాజకీయ పరిణామాల తో బొత్సతో కలిసి కోలగట్ల పనిచేస్తున్నారు. కానీ ఎప్పుడైనా ఏకు మేకై కూర్చొంటారన్న భయంతో ప్రత్యామ్నాయంగా టీడీపీ నుంచి యడ్ల రమణమూర్తిను బొత్స తీసుకొచ్చారు. దీంతో సీన్ అర్థమైందని, కథ మళ్లీ మొదటికొచ్చిందన్న భావన కో లగట్లకు ఎరుకైందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ వైపు చూస్తున్నారన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. అరుుతే ‘ఒక లీడర్ వెళ్లిపో తే పీసీసీ అధ్యక్షుడు హోదాలో అవమానమన్న భావనతో ఒకవైపు, అసెంబ్లీ ఎన్నికల్లో యడ్ల రమణమూర్తికి లైన్ క్లియర్ చేయవచ్చని మరో వైపు ఆలోచించి కోలగట్లకు ఎమ్మెల్సీ పోస్టును కట్టబెట్టారు’ అన్న వాదన కూడా ఉం ది. మొత్తానికి రాజీ వాతావరణం మధ్య అటు కోలగట్ల, ఇటు బొత్స కొనసాగుతున్నారు. యడ్లను తెరపైకి తెస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి జిల్లాకు వచ్చిన ఏఐసీసీ సభ్యుడు జీఎం ఆవారి, పీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.వి.రావుల ముందు కొంతమంది నాయకుల్ని వ్యూహాత్మకంగా బొత్స బరిలోకి దించి యడ్ల రమణమూర్తి పేరును ప్రతిపాదించినట్టు తెలిసింది. ఇదంతా గమనించే పోటీ నుంచి తప్పుకున్నట్టు కోలగట్ల ప్రకటించారన్న వార్తలు వినిపించాయి. ముఖ్యనేత మదిలో ఒక పేరు ఉండగా పోటీ చేస్తానని ప్రకటిస్తే భవిష్యత్‌లో గత పరిణామాలు పునరావృతమవుతాయని, రేసులో ఉండడం కంటే తప్పుకోవడమే మం చిదన్న నైరాశ్యంతో ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనంటూ కోలగట్ల ప్రకటించి ఉంటారని విసృ్తత చర్చ జరుగుతోం ది. మొత్తానికి బొత్స వేసిన ఎత్తుగడకు కోలగట్ల బోల్తా పడ్డారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. -
‘ఉరి’భయం!
= వీరప్పన్ అనుచ రుల్లో ఆందోళన = ఆవేదనలో కుటుంబాలు సాక్షి, చెన్నై: స్మగ్లర్ వీరప్పన్ అనుచరులకు ఉరిభయం పట్టుకుంది. తమ వాళ్లను ఉరి తీయడానికి కర్ణాటక చెరలో ఏర్పాట్లు జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, అప్జల్ గురు ఉరితీత అనంతరం ఆ శిక్షను ఎదుర్కొంటున్న వారిలో ఆందోళనలు నెలకొన్నాయి. రాష్ట్రంలోని వేలూరు జైల్లో ఉన్న రాజీవ్ హత్య కేసు నిందితులు, కర్నాటక చెరలో ఉన్న వీరప్పన్ అనుచరుల్లో ఉరి భయం వెంటాడుతోంది. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణకు గురి కావడం, కోర్టుల స్టేలతో తాత్కాలికంగా ఉరికి దూరంగా ఉన్నా, ఏ క్షణంలో తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందోనన్న భయంతో వీరు కాలం గడుపుతున్నారు. వీరప్పన్ అనుచరులు: స్మగ్లర్ వీరప్పన్ హతం అయినా, అతడి అనుచరుల జీవితాలు జైళ్లల్లో మగ్గుతున్నాయి. వీరిలో జ్ఞానప్రకాష్, సైమన్, పిలవేంద్రన్, మీసై మాదయ్యన్ ఉరిశిక్ష ఎదుర్కొంటున్నారు. వీరంతా కర్నాటక బెల్గాం జైల్లో ఉన్నారు. వీరిలో మీసై మాదయ్యన్ మాత్రం సేలం జిల్లా మెట్టూరుకు చె ందిన వ్యక్తి కాగా, మిగిలిన ముగ్గురు కర్ణాటక సరిహద్దు గ్రామాలకు చెందిన తమిళులు. 1991, 1993ల్లో కర్ణాటకలో ఓ పోలీసు స్టేషన్‌పై బాంబు దాడి, పాలారులో బాంబు అమర్చి 22 మంది పోలీసులను హతమార్చిన కేసుల్లో తడా చట్టం కింద వీరు అరెస్టు అయ్యారు. వీరికి తొలుత మైసూర్ తడా కోర్టు యావజ్జీవ శిక్షను విధించింది. దీన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టుకు ఈ నలుగురు అప్పీలు చేశారు. అయితే, వీరికి యావజ్జీవం సరిపోదని, ఉరి శిక్ష విధించాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో ఖంగుతిన్నారు. తమకు క్షమాభిక్ష పెట్టాలని 2004లో వీరు రాష్ట్రపతికి మొర పెట్టుకోగా, ఇటీవల అది తిరస్కరణకు గురి అయింది. ఈ విషయం బెల్గాం జైల్లో ఉన్న ఆ నలుగురికి తెలియడంతో బంధువులకు సమాచారం అందించారు. దీంతో తమ వాళ్లను ఉరి తీస్తారేమోనన్న ఆందోళన వారిలో మొదలైంది. ఉరితీత ఏర్పాట్లు జరిగినా, సేలం, ధర్మపురి, కృష్ణగిరి, ఈరోడ్ జిల్లాల్లోని మానవ హక్కుల సంఘాలు, తమిళాభిమాన సంఘాలు కోర్టుకు వెళ్లడంతో తాత్కాలిక బ్రేక్ పడింది. మళ్లీ భయం: కోర్టు తాత్కాలికంగా ఉరి శిక్షను నిలుపుదల చేసింది. అయితే, కోర్టు తాత్కాలిక గడువు కాలం ఈనెలాఖరుతో ముగియనున్నది. సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ ముగింపు దశకు చేరుకుంటోంది. వీరికి ఉరి శిక్షను సుప్రీం కోర్టే విధించి ఉన్న దృష్ట్యా, శిక్షలో ఎలాంటి మార్పులు ఉండే అవకాశాలు లేవు. దీంతో ఉరి తీత గడువు సమీపిస్తున్నదన్న ఆందోళన ఆ నలుగురిలో మొదలైంది. తమ వాళ్లకు ఆ కేసులతో సంబంధంలేనప్పటికీ, వారిని ఉరి తీయడానికి ప్రయత్నాలు జరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 13 తేదీలోపు ఉరి తీయొచ్చన్న సంకేతాలతో ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరు అవుతోన్నాయి. కర్నాటక జైళ్ల శాఖ డీఐజీ వీరభద్రస్వామి నేతృత్వంలో ప్రత్యేక బృందం తరచూ ఆ నలుగురికి వైద్యపరీక్షలు జరుపుతోన్నట్టు కుటుంబీకులు పేర్కొంటున్నారు. ఉరి శిక్ష అమలుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తమకు అనుమానం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అందియూరుకు చెందిన న్యాయవాది జూళియట్ పేర్కొంటూ, ఆ నలుగురి ఉరి శిక్ష నిలుపుదలకు తాను కోర్టులో పోరాడుతూనే ఉన్నానన్నారు. తనకు సహకారంగా రాజకీయ పార్టీలు నిలవాలని, అందరూ కలసి కట్టుగా ముందుకెళ్తే ఉరిని ఆపగలమని చెబుతున్నారు. పదోన్నతి: వీరప్పన్ వేటలో తనకు పదోన్నతి కల్పించలేదంటూ ఓ అటవీ అధికారి దాఖలు చేసుకున్న పిటిషన్‌కు చెన్నై హైకోర్టు బుధవారం స్పందించింది. వీరప్పన్ వేటలో అటవీ అధికారులు, ప్రత్యేక పోలీసులు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఎన్కౌంటర్లో వీరప్పన్‌ను హతమార్చిన అధికారులు, సిబ్బంది అందరికీ పదోన్నతులు, నజరానాలు అప్పట్లో భారీగానే దక్కాయి. అయితే, కోయంబత్తూరుకు చెందిన అటవీ శాఖ సిబ్బంది పుష్పకరన్ కు మాత్రం పదోన్నతి దక్కలేదు. దీంతో కోర్టును ఆయన ఆశ్రయించారు. ఎనిమిదేళ్ల తర్వాత ఎట్టకేలకు ఆయనకు పదోన్నతి కల్పించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెన్నై హైకోర్టు ఆదేశించడం విశేషం.