అంగరంగ వైభవం.. వీరభద్రస్వామి రథోత్సవం
గుమ్మఘట్ట మండలం తాళ్లకెరలో బుధవారం అశేష భక్తజనం నడుమ వీరభద్రస్వామి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పలువురు పీఠాధిపతులు, వేదపండితుల ఆధ్వర్యంలో వేకువ జామునే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని రాష్ట్ర వీరశైవ సంఘం అధ్యక్షులు, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గ్రామస్తులతో కలసి పల్లకీలో ఊరేగింపుగా తీసుకొచ్చి రథంపై కొలువుదీర్చారు. రథోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు కర్ణాటక నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రేవణ సిద్ధేశ్వర ట్రస్ట్ సభ్యులు అన్నదానం తో పాటు భక్తులకు సౌకర్యాలు కల్పించారు