బుల్లితెర నటి ప్రీతినిగమ్ సందడి
గుమ్మఘట్ట : బుల్లితెర నటి ప్రీతినిగమ్ సోమవారం మండలంలో సందడి చేశారు. గోపీవర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఒక్క క్షణం’ షార్ట్‌ఫిలింలో ఆమె కీలకపాత్ర పోషిస్తున్నారు. సోమవారం గుమ్మఘట్ట పీహెచ్‌సీ వద్ద ప్రీతినిగమ్‌పై సన్నివేశాలు చిత్రీకరించారు. షూటింగ్ అనంతరం ఆమె 75 వీరాపురం కొండలు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. బుల్లితెర నటిని చూసేందుకు మహిళా ప్రేఓకులు ఎగబడ్డారు. ప్రీతినిగమ్ మాట్లాడుతూ డైరెక్టర్‌తోపాటు పలువురు తనను సంప్రదించడంతో సమాజ హితం కోసం తీస్తున్న ఈ షార్ట్‌ఫిలింలో తాను నటించేందుకు ఒప్పుకున్నానన్నారు.