
రెండు ఆలయాల్లో చోరీ
చింతకొమ్మదిన్నెమండలంలోని గంగమ్మతోపు ఆవరణలోని సాయిబాబా, వీరభద్రస్వాముల ఆలయాల్లో శనివారం అర్ధరాత్రి హుండీల్లోని నగదును దుండగులు చోరీ చేశారు. సాయిబాబా ఆలయానికి ఉన్న తలుపుల గడియకు ఉన్న తాళాన్ని పగులగొట్టి హుండీని బయటికి ఎత్తుకెళ్లారు.
చింతకొమ్మదిన్నె: మండలంలోని గంగమ్మతోపు ఆవరణలోని సాయిబాబా, వీరభద్రస్వాముల ఆలయాల్లో శనివారం అర్ధరాత్రి హుండీల్లోని నగదును దుండగులు చోరీ చేశారు. సాయిబాబా ఆలయానికి ఉన్న తలుపుల గడియకు ఉన్న తాళాన్ని పగులగొట్టి హుండీని బయటికి ఎత్తుకెళ్లారు. హుండీ తాళాలు పగులగొట్టి నగదు దోచుకెళ్లారు. అలాగే సమీపంలోని వీరభద్రస్వామి ఆలయంలో ఉన్న పురాతన హుండీ తాళాలను పగులగొట్టి అందులోని సొమ్మును కాజేసినట్లు ఆలయ ధర్మకర్తలు చిన్న ఓబన్న, లింగారెడ్డి పేర్కొన్నారు. రెండు ఆలయాల్లో రూ. 50 వేలు దోచికెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆదివారం సీకే దిన్నె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఏఎస్‌ఐ దస్తగిరి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.