
ఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు
గుంటూరు: సీపీఎస్ విధానంపై ఏపీ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని ఏపీ ఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వేసిన కమిటీపై తమకు నమ్మకం లేదని చెప్పారు. తమిళనాడులో కమిటీ వేసి రెండున్నరేళ్లు దాటినా ఫలితం లేదని పేర్కొన్నారు. ఇక్కడ వేసిన కమిటీ పరిస్థితి కూడా అదేనని అన్నారు. సీపీఎస్ కొనసాగిస్తే ఆర్ధిక భారం అనేది శుద్ధ అబద్ధమన్నారు.
దీనిపై ప్రభుత్వంతో బహిరంగ చర్చకు తాము సిద్దమని సవాల్ విసిరారు. కొన్ని సంఘాలు మా పోరాటంపై విమర్శలు చేస్తున్నాయని, పద్ధతులు మార్చుకోకుంటే ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఉద్యమాన్ని రాజకీయంగా వాడుకోవాల్సిన అవసరం జేఏసీకి లేదని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment