పర్చూరు : గతంలో ఎకరం పొగాకుకు రూ. 30 నుంచి రూ. 35 వేల వరకు పెట్టుబడి అయ్యేదని ప్రస్తుతం లక్ష వరకు పెరిగిందని దీంతో రైతులు నష్టపోతున్నారని వెంకటాపురం గ్రామానికి చెందిన కె.బ్రహ్మారెడ్డి, ఎ.వెంకటేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు ఒక తడికి రూ. 10 వేలు ఖర్చవుతుందని.. ప్రస్తుతం క్వింటా రూ. 20 వేలు అమ్మితే నష్టాల్లేకుండా పెట్టుబడులు మాత్రమే వస్తాయని తెలిపారు.
స్వచ్ఛంద సంస్థలకు సాయం అందడంలేదు
పర్చూరు : వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో స్వచ్ఛంద సేవా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున విరివిగా తగినన్నీ నిధులు కేటాయించి నిరుపేద హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి అని ఐఈఈఆర్‌డీ ప్రెసిడెంట్ బి.కిరణ్‌చంద్ తెలిపారు. అయితే ప్రస్తుతం తాగునీటి సమస్య, నిరుపేద మహిళలకు జీవన భృతి కోసం ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించకలేక పోతున్నామన్నారు. వృద్ధులకు పింఛన్లు అందకపోవడం, చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, జీవనాధారం కల్పించటం లేదని జగన్‌కు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment