ఆర్మూర్/మోర్తాడ్/నందిపేట/ న్యూస్‌లైన్: పొట్ట చేతపట్టుకుని ఉపాధి కోసం సౌదీ వెళ్లినవారి బతుకులు ఆగమవుతున్నాయి. వీసా, విమా నం టికెట్టు ఖర్చుల కోసం ఇక్కడ అప్పు చేసివెళ్తే.. సౌదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నతాఖా చట్టం నెత్తి మీద పిడిగు పడేలా చేసింది. అనుమతి లేకుండా అ క్కడ ఉన్న వారిని జైలులో పెడుతోంది.
దీంతో తిరిగి వచ్చేందుకు తెలుగువారు మళ్లీ అప్పుచేయాల్సి వ స్తోంది. ఇలా జిల్లాకు చెందిన సుమారు 35వేల మంది సౌదీలో ఇబ్బందులు పడుతున్నారు. ఇందు లో డ్రైవర్లు, ఇంటి పనివారు, గార్డెనింగ్ పని ఇతర త్రా కార్మికులు ఉన్నారు. జిల్లా నుంచి సౌదీకి వెళ్లిన వారిలో అనేకమంది నిరక్షరాస్యులు ఉన్నారు. వీరికి అక్కడి చట్టాల గురించి అవగాహన లేకపోవడం, పనులకు సంబంధించి నిబంధనలు తెలియకపోవడంతో కఫిల్ చెప్పిందే వేదంగా వీసాలలో పేర్కొన్న పనులకు విరుద్ధంగా ఇతర పనులు చేస్తున్నారు. ఇలాంటి వారు సౌదీ అధికారులకు దొరికితే జైలు పాలవుతున్నారు. స్వగ్రామానికి వచ్చేద్దామంటే విమా నం టికెట్టుకు సైతం డబ్బులు లేని దుస్థితిలో ఉన్నారు. సౌదీలో వేల మంది కష్టాలు పడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.
రెండేళ్లయినా ఫోను లేదు..
నందిపేట మండలం వెల్మల్ గ్రామానికి చెందిన సాదుల అశోక్‌ది నిరుపేద కుటుంబం. తల్లి ఆరేళ్ల క్రితమే మృతి చెందింది. వృద్ధుడైన తండ్రితో పాటు భార్య సుజాత, కొడుకును పోషించేందుకని ఉపాధి కోసం మూడేళ్ల క్రితం రూ. లక్ష 30 వేలు చెల్లించి గొర్రె ల మార్కెట్‌లో పనికొరకు సౌదీకి వెళ్లాడు. కానీ అక్క డ వీసాలో పేర్కొన్న పనిలేకపోవడంతో అక్కడి కఫిల్ అశోక్‌ను అడవిలో డ్యూటీకి పడేశాడు. జరిగిన ఘోరా న్ని కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ బోరున విలపించిన అశోక్ తన దగ్గర ఫోను లేదని తాను ఫోను చేసిసప్పు డే మాట్లాడండని చెప్పి రెండేళ్లవుతోంది. అతని నుంచి ఇంతవరకూ మళ్లీ ఫోను రాలేదు. ఇప్పుడు ఈ నితాఖత్ నిబంధన ఆయన కుటుంబ సభ్యులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. గత ఏడాది క్రితం అశోక్ తండ్రి అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ విషయం కూడా అశోక్‌కు తెలియదు. రెండేళ్ల కిత్రం కొడుకు పుట్టిన విషయం కూడా తెలియదు. భర్త జాడలేక.. ఇద్దరు పిల్లలను పోషించలేక ఆ ఇల్లాలు నానా కష్టాలు పడుతోంది. నిత్యం భర్త ఫోను చేస్తాడని ఎదురుచూస్తోం ది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నభోజన కేంద్రంలో వంటచేస్తూ ఐదేళ్ల లోపు ఇద్దరు పిల్లలను సాకుతోంది.
నతాఖా చట్టంతో.. సౌదీలో నిజామాబాద్ వాసుల పాట్లు
Published Fri, Nov 8 2013 4:38 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 AM
Advertisement