సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలి చైర్మన్‌గా ఎన్‌ఎండీ ఫరూక్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఫరూక్‌కు మంత్రులు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు. ఫరూక్‌ను శాసనమండలి నేత యనమల రామకృష్ణ, బీజేపీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు చైర్మన్ పీఠం వద్దకు తీసుకెళ్లగా ఆయన భాద్యతలు చేపట్టారు.
కాగా మండలి చైర్మన్‌గా ఫరూఖ్‌కు అవకాశం ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో ఆయనకు హామీ ఇచ్చారు. ఇచ్చిన హమీ మేరకు ఫరూఖ్‌ను మండలి చైర్మన్‌గా నియమించారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఫరూఖ్ గతంలో మంత్రిగా కూడా పనిచేశారు.
శాసనసభ, శాసనమండలిలో చీఫ్ విప్, విప్‌లను సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. శాసన సభలో ఇప్పటికే నలుగురు ఉన్న విప్‌లకు అదనంగా మరో ఇద్దరికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. శాసనసభలో చీఫ్ విప్‌గా పల్లె రఘునాథరెడ్డి, శాసనమండలి చీఫ్ విప్‌గా పయ్యావుల కేశవ్‌లను నియమించారు. అలాగే శాసనసభలో విప్‌లుగా ఎమ్మెల్యేలు గణబాబు, సర్వేశ్వరరావులను, శాసనమండలి విప్‌లుగా బుద్దా వెంకన్న, డొక్కా మాణిక్య వరప్రసాద్, రామసుబ్బారెడ్డి, షరీఫ్‌లను నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment