
గాయపడ్డ బాలాజీతో కుటుంబసభ్యులు
మంగంపేట(ఓబులవారిపల్లె): ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం రోజున జరిగిన ప్రమాదంలో గాయపడిన మంగంపేటకు చెందిన వడ్డి బాలాజీకి ప్రభుత్వం ప్రకటించిన పరిహారం జాబితాలో పేరు లేకపోవడంతో సోమవారం స్థానిక రెవెన్యూ అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు.
మంగంపేట ఆర్‌ఆర్‌సెంటర్‌లో ఆటోనడుపుకుంటూ జీవిస్తున్న వడ్డి బాలాజీ సీతారాముల కల్యాణం చూడటం కోసం కుటుంబంతో కలిసి ఒంటిమిట్టకు వెళ్లారు. అక్కడ వీచిన గాలివానల్లో రేకులు కాలికి తగలడంతో కుడికాలు నాలుగువేళ్లు నరాలు తెగిపోయాయి.
తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించగా అక్కడ ఆర్థోవైద్యులు అందుబాటు లేకపోవడంతో ప్రైవేటు ఆరోగ్య కేంద్రంలో చికిత్సపొందారు. అయితే ప్రభుత్వం ఆరోగ్యకేంద్రంలో వైద్యం చేయించుకున్న వారికి మాత్రమే ప్రభుత్వం పరిహారం ప్రకటించడంతో ప్రైవేటు ఆరోగ్యకేంద్రంలో వైద్యం చేయించుకున్నవారి పేరు రాలేదు.
ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న బాలాజీ మంచానికే పరిమితం కావడంతో కుటుంబపోషణ భారంగా మారింది. ముగ్గురు పిల్లలు, భార్య ఉన్నారని ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందేలా చూడాలని స్థానిక రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment