రైట్ రైట్ అనగానే ముందుగా గుర్తొచ్చేది కండక్టర్లు. కండక్టర్ ఉద్యోగం అంటేనే కొందరు పురుషులు జంకుతుంటారు. అలాంటిది ఆర్టీసీ లో పురుషులకు దీటుగా మహిళా కండక్లర్లూ విధులు నిర్వర్తిస్తున్నారు.
డిమాండ్ల సాధనకు మహిళా కండక్టర్ల సమరం
కష్టాలు ఎదురీదుతూ.. ఒత్తిడిని జయిస్తూ..
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ :
రైట్ రైట్ అనగానే ముందుగా గుర్తొచ్చేది కండక్టర్లు. కండక్టర్ ఉద్యోగం అంటేనే కొందరు పురుషులు జంకుతుంటారు. అలాంటిది ఆర్టీసీ లో పురుషులకు దీటుగా మహిళా కండక్లర్లూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంట్లో భర్త, పిల్లలకు సేవచేస్తూనే ఇటూ ఉద్యోగంలోనూ దూసుకెళ్తు న్నారు. అయినా.. నిత్యం వారికి కష్టాలు తప్పడం లేదు. కార్మిక చట్టం ప్రకారం 7.20 గంటలు పనిచేయాలి. కానీ, ఉదయం నుంచి రాత్రి వరకు ఎనిమిది గంటలపాటు పనిచేస్తున్నారు. వేతనాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. మహిళా కండక్టర్లకు ప్రత్యేక సౌకర్యాలు కనిపించవు. మహిళా సంఘాలు కూడా సమస్యలపై పోరాటాలు చేసినా పరిష్కారానికి నోచుకోవడం లేదు. జిల్లాలో ఆరు డిపోలు ఉండగా, 219 మంది మహిళా కండక్టర్లు పనిచేస్తున్నారు. ఆదిలాబాద్‌లో డిపోలో 45, ఆసిఫాబాద్‌లో 23, భైంసాలో 22, మంచిర్యాలలో 85, నిర్మల్‌లో 41, ఉట్నూర్‌లో 3 మంది మహిళా కండక్టర్లు పనిచేస్తున్నారు. వీరి సమస్యలు పరిష్కారంలో ఆర్టీసీ అధికారులు అలసత్వం వ్యవహరిస్తున్నారు. 240 రోజులకు బదులు 120 రోజులకు ప్రసూతి సెలవులు ఇవ్వడంతో అవస్థలు పడుతున్నారు.
మహిళా కండక్టర్ల డిమాండ్లు..
ముందస్తుగా పెట్టుకున్న సెలవులు మంజూరుచేయాలి.
{పసూతి సెలవులు 240 రోజులు ఇవ్వాలి.
ఆయా డిపోల్లో ప్రత్యేక విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, భోజన గదిని నిర్మించాలి.
కార్మిక చట్టం ప్రకారం వారాంతపు సెలవులు ఇవ్వాలి.
రాత్రి ఎనిమిది గంటల లోపు ఇంటికి చేరాలా డ్యూటీలు వేయాలి.
డే ఔట్ డ్యూటీ చేసిన తర్వాత ప్రత్యేక సెలవు ఇవ్వాలి.
ఒక రోజు తప్పించి ఒక రోజు డే ఔట్.. డే డ్యూటీలు వేయాలి.
మహిళా కండక్టర్ యూనిఫాంలను అందించాలి.
ఎండీ సర్క్యూలర్ ప్రకారం ఫిక్స్‌డ్ చాట్ వేయాలి.