
'పనిచేయడానికి ఆఫీసులు కూడా లేవు'
హైదరాబాద్: రైతులు ఆత్మగౌరవంతో బతికేట్టు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రైతులకు మేలు చేస్తామని చెప్పారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో మూడు తీర్మానాలు ఆమోదించినట్టు వెల్లడించారు. రుణమాఫీపై కమిటీ వేసి అందరి అభిప్రాయాలు తీసుకున్నామన్నారు.
రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. దీపావళి కానుకగా ఈనెల 22న దీన్ని ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నాయన్నారు. తాము పనిచేయడానికి కార్యాలయాలు కూడా లేవని వాపోయారు. ఇంకా రాజధాని నగరాన్ని అభివృద్ధి చేయాల్సివుందన్నారు.