సాక్షి, రాజమండ్రి :
పల్లెల్లో ప్రజారోగ్య పరిరక్షణకు ఏర్పాటు చేసిన ఆరోగ్య ఉప కేంద్రాలు (సబ్ సెంటర్లు) సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నా యి. అనేక చోట్ల అద్దె ఇళ్లల్లో, శిథిల భవనాల్లో నిర్వహించాల్సిన దుస్థితి. వీటికి కొత్త భవనాలు నిర్మించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. జిల్లాలో 103 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), 20 సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీలు), ఏడు ఏరియా ఆస్పత్రుల పరిధిలో 809 ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటిని ఏఎన్‌ఎంలు నిర్వహిస్తారు. నిబంధనల ప్రకారం ఏఎన్‌ఎం సబ్ సెంటర్‌లో ఉంటూ.. 24 గంటలూ పేదలకు అందుబాటులో ఉంటారు. రోగులకు ప్రాథమిక చికిత్సతో పాటు అవసరమైతే సమీప పీహెచ్‌సీలకు తరలించేందుకు ఇక్కడ సదుపాయాలు అందుబాటులో ఉండాలి. కేవలం 130 మాత్రమే ఏఎన్‌ఎం క్వార్టర్లతో కలిసి ఉన్నాయి. మిగిలిన 639 అద్దె ఇళ్లల్లోనే ఉండ గా సుమారు 400 కేంద్రాలు మందులు నిల్వ చేసుకునే వీలు కూడా లేని స్థితిలోఏఎన్‌ఎంల ఇళ్లలోనే కొనసాగుతున్నాయి. పక్కా భవనాలు కావాల్సిన సబ్ సెంటర్లు వందల సంఖ్యలో ఉండగా, ఈ ఏడాది 23 కేంద్రాలకు మాత్రమే భవనాలు మంజూరయ్యాయి. కనీసం మరో వంద మంజూరవుతాయని భావించిన అధికారులకు నిరాశే మిగిలింది.
కనీస సదుపాయాలకూ కరువే..
జిల్లాలో ప్రతి 5 వేల మందికి ఒక సబ్ సెంటర్ ఉంది. గ్రామీణ ప్రజలు చిన్నచిన్న వ్యాధులకు వీటిపైనే ఆధారపడుతున్నారు. జిల్లాలోని సమస్యాత్మకమైన 55 పీహెచ్‌సీల పరిధిలోని సుమారు 300 సబ్ సెంటర్లలో రోగులను పరీక్షించేందుకు కూడా సదుపాయాలు లేవు. 2012-13లో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ చేసిన సర్వే ప్రకారం 21 సబ్‌సెంటర్లలో తాగునీరు, కరెంటు, టాయ్‌లెట్లు కూడా లేవని వెల్లడైంది.
ప్రతిపాదనలు పంపాం : డీఎంహెచ్‌ఓ
పీహెచ్‌సీలకు భవనాల కొరత తీరినా జిల్లాలో సబ్ సెంటర్లకు పక్కా భవనాల అవసరం ఉందని డీఎంహెచ్‌ఓ డాక్టర్ పద్మావతి చెప్పారు. మరిన్ని భ వనాలు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. వీటికి అనుబంధంగా అంగన్‌వాడీ కేం ద్రాలను నిర్మించాలని కోరామన్నారు.
సదుపాయాలు అరకొరే..
Published Sat, Nov 16 2013 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM
Advertisement
Advertisement