ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : ఏటీఎం.. ఎనీ టైం మనీ. వీటి సేవలు బాగానే ఉన్నా.. డబ్బులు డ్రా చేసుకునే వేళ భద్రత మాత్రం కానరావడం లేదు. మహానగరమైన బెంగళూరులో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లిన ఓ మహిళపై అగంతకుడు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ముఖం, తలపై తీవ్రంగా గాయపర్చాడు. ఈ ఘటన జిల్లా వాసులనూ భయాందోళనకు గురిచేస్తోంది. జిల్లాలోని ఏటీఎంల వద్ద ఎంతవరకు భద్రత ఉందనేది వారిలో ప్రశ్న తలెత్తుతోంది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్, రూరల్ బ్యాంకులన్నీ కలిపి 237 ఉన్నాయి. రూరల్ బ్యాంకులకు ఏటీఎం సదుపాయం లేదు. మిగతా బ్యాంకులకు సంబంధించి 112 ఏటీఎం జిల్లాలో ఉన్నాయి. ఇందులో అత్యధికంగా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ 53, ఆంధ్రాబ్యాంక్ 16, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా 8, ఐసీఐసీఐ 7, హెచ్‌డీఎఫ్‌సీ 6, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4, యాక్సెస్ 2, కరూర్‌వైశ్య, లక్ష్మివిలాస్ రెండేసి, మిగతా బ్యాంకులు ఒక్కో ఏటీఎంలు కలిగి ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ ఏటీఎం కేంద్రాల వద్దే బ్యాంక్ యాజమాన్యాలు సెక్యూరిటీ గార్డులను నియమిం చింది. వివిధ ఏజెన్సీల నుంచి సదరు సెక్యూరిటీ గార్డులను బ్యాంక్‌లు నియమించుకున్నాయి. ప్రభుత్వ ఏటీఎం కేంద్రా ల వద్ద సెక్యూరిటీ గార్డులు ప్రస్తుతం కనిపించడంలేదు.
గతంలో సెక్యూరిటీ గార్డులను నియమించినా వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో వారిని తొలగించారు. ఏటీఎం కార్డు వినియోగంపై అవగాహనలేని వినియోగదారు లను సెక్యూరిటీగార్డు బోల్తా కొట్టించి డబ్బులు డ్రా చేయడం వంటి సంఘటనలు గతంలో జరిగిన నేపథ్యంలో పలు ప్రభు త్వ బ్యాంకులు సెక్యూరిటీగార్డులను తొలగించారు. ఏటీఎం కేంద్రాల్లో ఏసీ మిషన్లు మూలనపడ్డాయి. సీసీ కెమెరాలు కూ డా సరిగా పనిచేయడం లేదు. కేంద్రాలకు గ్లాస్ డోర్ ఆటోమెటిక్‌గా మూసుకునే పరిస్థితి లేక ఎప్పుడూ తెరిచే ఉంటున్నా యి. ఈ నేపథ్యంలో అగంతకులు నేరుగా చొచ్చుకు వచ్చే ప్ర మాదమూ లేకపోలేదు. రూ.కోట్ల లావాదేవీలు నిర్వహించే బ్యాంకులు ఏటీఎం పరంగా మాత్రం సెక్యూరిటీగార్డులను నియమించకపోవడం, కనీస వసతులు కల్పించకపోవడంపై వినియోగదారుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో వైద్య విద్యార్థినులు అక్కడి ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తుంటారు. ఆ పరిసరాల్లో రా త్రివేళ చీకటి ఆవహించి ఉంటుంది. అక్కడ కూడా సెక్యూరిటీగార్డులు లేకపోవడం భద్రత తేటతెల్లమవుతోంది. అనేక ఏటీఎంలలో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. కాగా సీసీ కెమెరాలకు సంబంధించి అలర్ట్ సిస్టమ్ కూడా లేకపోవడం దొం గల పనికి సులువవుతోంది. పోలీస్ పెట్రోలింగ్ పార్టీలు ఏటీఎంలపై కూడా దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
మచ్చుకు కొన్ని..
ఆదిలాబాద్‌లోని శివాజీచౌక్ ఏటీఎం కేంద్రం వద్దకు ఆరు నెలల కిందట జైనథ్‌కు చెందిన ఓ వృద్ధుడు తన మనుమడుతో కలిసి డబ్బులు డ్రా చేసేందుకు వచ్చాడు. ఆయనకు డబ్బులు తీయరాకపోవడం, మనుమడికి కూడా అవగాహన లేకపోవడంతో సమీపంలోని మరో వ్యక్తి వారికి డబ్బులు డ్రా చేసి ఇచ్చాడు. ఆ క్రమంలోనే వారి కార్డును మార్చేసి తన దగ్గరున్న మరో కార్డును వారికిచ్చి అక్కడి నుంచి ఉడాయించాడు. ఆ తర్వాత ఆర్మూర్ బ్రాంచ్‌లో ఆ అకౌంట్ నంబర్ నుంచి తన బినామీ అకౌంట్‌కు రూ.40 వేల డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. ఈ సంఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, బ్యాంక్ సిబ్బంది సీసీ కెమెరా ఫుటేజ్ అందజేశారు. అయితే ఇప్పటివరకు కేసు మిస్టరీ వీడలేదు. నేరస్తుడు పట్టుబడలేదు. ఈ నేపథ్యంలో ఏటీఎం కేంద్రాల వద్ద సెక్యూరిటీగార్డు ఆవశ్యకత ఎంతగానో అవసరం కానుంది.
ఎనీ టైంభయమే..
Published Thu, Nov 21 2013 3:51 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement