సాక్షి, ఏలూరు : జిల్లాలో వరినాట్లు నెల రోజులు ఆలస్యమయ్యాయి. కొద్ది రోజులుగా సాగు నీరు అందక చేలు ఎండిపోయే పరిస్థితి తలెత్తింది. కలుపు మొక్కలు పెరిగిపోవడంతో వరి దుబ్బులు సరిగా మూన కట్టడం లేదు. ఈ పరిస్థితుల్లో కనీసం చిరు జల్లులైనా పలకరిస్తే చాలని రైతులంతా ఆకాశం వైపు ఆబగా చూస్తున్నారు. ఎట్టకేలకు మంగళవారం వరుణుడు పలకరించాడు. జిల్లా వ్యాప్తంగా కురిసిన వాన ఖరీఫ్ రైతుల ఆశల్ని చిగురింపజేసింది. రానున్న పక్షం రోజుల్లో ఎంతోకొంత వర్షం కురిస్తే ఏదోరకంగా గట్టెక్కవచ్చనే ఆశతో అన్నదాతలు ఉన్నారు.
ఈ నెల రెండో వారం నాటికి జిల్లాలో 457.2 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 368.3 మి.మీ. కురిసింది. అదనులో కురవకపోవడంతో ఆ జల్లులేవీ రైతులకు అక్కరకు రాలేదు. జిల్లాలో ఈ ఖరీఫ్ పంట కాలంలో 2.42 లక్షల హెక్టార్లలో వరినాట్లు వేయాల్సి ఉండగా, ఇప్పటివరకు దాదాపు 1.90 లక్షల హెక్టార్లలో మాత్రమే నాట్లు పూర్తయ్యాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆదినుంచీ ఎదురవుతున్న అవాంతరాలు ఖరీఫ్ రైతును కలవరపెడుతున్నాయి. ఆగస్టు తొలివారానికే జిల్లాలో నాట్లు పూర్తికావాల్సి ఉన్నప్పటికీ సెప్టెంబర్ మొదటి వారానికి గానీ కొలిక్కి వచ్చేలా లేవు. అంటే ఖరీఫ్ సీజన్ దాదాపు నెల రోజులు ఆలస్యమైంది. ఫలితంగా రైతులకు కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి.
అడుగడుగునా నీటి సమస్యలే.. సాధారణంగా నారుమడి వేసిన 20 రోజులకు నాట్లు వేసే అవకాశం కలుగుతుంది. కాలువలకు సాగునీటి విడుదల ఆలస్యం కావడం, మధ్యలో డెల్టా ఆధునికీకరణ పేరుతో కొన్ని కాలువలకు నీరు నిలిపివేయడం, వర్షాలు లేకపోవడం వంటి కారణాలతో నారుమళ్లు ఆలస్యమయ్యాయి. ఫలితంగా నాట్లు కూడా ఆలస్యమయ్యాయి. నాట్లు వేసిన తరువాత వానలు కురవకపోవడంతో చేలల్లో తగినంత నీరులేక కలుపు విపరీతంగా పెరిగిపో
దానిని తొలగించడానికి ఎక్కువ మంది కూలీలను వినియోగించాల్సి వస్తోంది. ఇందుకోసం ఎకరానికి కనీసం రూ.వెరుు్య నుంచి రూ.1,500 అదనంగా వెచ్చిస్తున్నారు. కలుపు తీసిన తర్వాత కూడా నీరు సరిగా లేకపోతే మళ్లీ కలుపు పెరిగి పంట దిగుబడి తగ్గిపోతుంది. రెండోసారి కలుపు తీయించాల్సి వస్తే అందకయ్యే ఖర్చు రైతులపై మరింత భారం మోపనుంది. ఈ పరిస్థితుల్లో ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, ఆచంట, నిడదవోలు, పోలవరం, తణుకు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల్లో కృష్ణా నీటిపై ఆధారపడి సాగుచేసే రైతులు నాట్లు ప్రారంభించారు. మొత్తానికి ఎండిపోయే స్థితికి చేరుకున్న వరి చేలకు మంగళవారం నాటి వర్షం జీవం పోసింది.
ఖరీఫ్‌ను కనికరించిన వర్షం
Published Wed, Aug 28 2013 5:48 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM
Advertisement