44 ఏళ్లుగా సీమాంధ్ర నాయకులే సీఎంలుగా ఉన్నరు. నాడు తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఎవరూ మాట్లాడలేకపోయారు. ఇందుకు సీమాంధ్ర సీఎంలు బాధ్యులు కాదా? నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీమాంధ్రకు ఏదో జరిగిపోతుందంటున్నరు. అక్కడి ప్రజలను భయపెట్టేలా లేనిపోని అవాస్తవాలు మాట్లాడుతున్నరు. డిసెంబర్‌లో తెలంగాణ రాష్ట్ర తథ్యం.. ఇప్పుడు ఏ శక్తీ ఆపలేదు
- దామోదర రాజనర్సింహా
ఉప ముఖ్యమంత్రి
గద్వాల, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచే ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం కొనసాగిం దని, ఈ పోరాటంలో ఎందరో ప్రాణత్యాగా లు చేశారని ఉప ముఖ్యమంత్రి దామోదర రా జనర్సింహా గుర్తుచేశారు. ఇన్నేళ్ల పోరాటాన్ని అర్థం చేసుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఓ నిర్ణయం తీసుకున్నార ని, ఇప్పుడు ఏ శక్తి అడ్డొచ్చినా తెలంగాణను ఆపలేదని స్పష్టంచేశారు. మంగళవారం గద్వాల పట్టణంలో ని తేరుమైదానంలో తెలంగాణ జైత్రయాత్ర సభ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడు తూ.. 1956 నుంచి తెలంగాణకు అన్నింటా అన్యాయం చేస్తూ వచ్చారని, తె లంగాణ ప్రజలు పోరాడి కేంద్రానికి తెలిసేలా చేసి ముల్కీ నిబంధనలను తెచ్చుకున్నారని గు ర్తుచేశారు. దీన్ని కూడా ఓర్వలేని సీమాంధ్రులు హైకోర్టుకు వెళ్లి వారికి అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చేసుకున్నారని తెలిపారు. దీంతో తెలంగాణలో 1969 లో ప్రత్యేకరాష్ట్రం కోసం పెద్దఎత్తున ఉద్యమం జరిగిందన్నారు. పెద్ద మనుషుల ఒప్పందం, 610 జీఓను ఉల్లంఘించి అన్యాయం చేస్తూ వ స్తున్నారని అన్నారు. వీటన్నింటిని పరిశీలించిన సోనియాగాంధీ ప్రత్యేకరాష్ర్ట ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో ఎవరైనా ఉండొచ్చు
తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా తమకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడుతుంటే మా ట్లాడని టీడీపీ, వైఎస్‌ఆర్ సీపీలు ఇప్పుడు మా ట్లాడటం ఏమిటని విమర్శించారు. లేఖలు ఇ చ్చారు, అఖిలపక్షాల సమావేశాల్లో అభిప్రాయాలు చెప్పారు, ఇప్పుడు సమైక్యాంధ్ర అని మాట్లాడుతున్నారని అన్నారు. కేవలం సీమాం ధ్రలో రాజకీయ లబ్ధికోసమే నాటాకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో ఎవరైనా ఉండొచ్చని, పొమ్మని ఎవరంటారని ప్ర శ్నించారు. కేవలం అపోహలు కల్పించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. డిసెంబర్‌లో తె లంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని, 2014 ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయన్నది నిజమ ని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా స్పష్టంచేశారు. పీసీసీ మాజీ అధ్యక్షులు డి. శ్రీ నివాస్, కేంద్ర మంత్రులు సర్వే సత్యనారాయ ణ, బలరాంనాయక్, మంత్రులు జానారెడ్డి, డీ కే అరుణ, బసవరాజు సారయ్య, సుదర్శన్‌రెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, పొన్నాల ల క్ష్మయ్య, గడ్డం ప్రసాద్‌కుమార్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్‌బా బు, ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, పొ న్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్‌రె డ్డి, రాజ య్య, సురేష్ షెట్కార్, కోమటిరెడ్డి రా జగోపాల్‌రెడ్డి, వివిధ జిల్లాల ఎమ్మెల్యేలు, డీ సీసీ అధ్యక్షులు, కాంగ్రెస్‌పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ ను ఏ శక్తీ ఆపలేదు
Published Wed, Oct 30 2013 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM
Advertisement