sima andhra
-
రగులుతున్న రాజధాని ఉద్యమం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం తెలపడంతో సీమాంధ్రలో కొత్త రాజధానిపై ఉద్యమాలు మొదలయ్యాయి. ఆంధ్రరాష్ట్రానికి రాజధానిగా ఉన్న కర్నూలుకు అవకాశం ఇవ్వాలని జిల్లా ప్రజలు పట్టుబడుతున్నారు. విద్యార్థి సంఘాలతోపాటు, పలు ప్రజా సంఘాల నాయకులు ఈ మేరకు ఆందోళనలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త రాజధానిపై కేంద్రం కసరత్తు ప్రారంభించింది. కేంద్ర హోంశాఖ వర్గాలు సీమాంధ్రలోని పలు ప్రాంతాల గురించి ఆరా తీయటం ప్రారంభించాయి. అందులో కర్నూలు జిల్లా పేరు ప్రస్తావన కూడా వచ్చినట్లు తెలిసింది. దేశంలో 1952లో మొదటి సారిగా లోక్‌సభ, శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల తరువాత 1953 అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేశారు. కొందరు పాలకుల స్వార్థ ప్రయోజనాల కోసం కర్నూలుకు అన్యాయం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్‌ను ఎంపికచేశారు. జిల్లా వాసులకు కన్నీరు మిగిల్చారు. ఆ తరువాత హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారు. పలు రంగాలకు చెందిన వారంతా ఆశలన్నీ హైదరాబాద్‌పైనే పెట్టుకుని జీవించారు. తిరిగి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో రాష్ట్రాన్ని రెండుగా చీల్చారు. హైదరాబాద్ నుంచి వేరు చేసి సీమకు మరోసారి గొంతు కోశారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలన్నీ పోగొట్టుకున్నారు. రైతులకు నీటి వాటాలో తీరని అన్యాయం జరుగనుంది. కరువు కాటకాలతో అల్లాడుతున్న రాయలసీమకు అన్యాయం జరుగకుండా ఉండాలంటే కర్నూలును రాజధాని చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. రాయలసీమ అభివృద్ధి కోసం సెంట్రల్ యూనివర్సిటీ, ఎన్ఐటీ, నిమ్స్, అంతర్జాతీయ మెట్టపొలాల పరిశోధన కేంద్రం, అంతర్జాతీయ అగ్నికల్చర్ ఇరిగేషన్ సంస్థ, అంతర్జాతీయ ఫార్మసి పరిశోధన సంస్థ, రాయలసీమలో ఉన్న ఖనిజసంపదల అనుసంధానంగా నూతన పరిశ్రమల కోసం, విశ్వవిద్యాలయాల అబివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.5లక్షల కోట్ల ప్యాకేజిని ప్రకటించాలని డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఉద్యమానికి శ్రీకారం.... సీమాంధ్ర రాజధానిగా కర్నూలును ప్రకటించాలనే డిమాండ్‌తో కర్నూలు వాసులు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య శుక్రవారం ఆందోళనకు దిగింది. వీరే కాకుండా మొదటి నుంచి రాజధాని కోసం మరి కొందరు డిమాండ్ చేస్తున్నారు. వారిలో తెలుగు వికాస ఉద్యమకారులు, కల్కూర, సీమ జనతాపార్టీ తదితరులు ఒక్కొక్కరుగా తెరపైకి వస్తున్నారు. వీరితో పాటురాయలసీమ యునెటైడ్ ఫ్రంట్, రాయలసీమ యూత్ ఫ్రంట్ నాయకులు ఉద్యమబాట పట్టారు. -
సీమాంధ్రలో 150 సీట్లలో గెలుపు ఖాయం
=తెలంగాణలోనూ మెజారిటీ స్థానాలు =‘గడపగడపకు వైఎస్సార్సీపీ’తో పార్టీని మరింత పటిష్టం చేయాలి =పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నూజివీడు, న్యూస్‌లైన్ : సీమాంధ్రలోని 175 ఎమ్మెల్యే స్థానాలకు గాను 150 పైనే స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగిం చడం ఖాయమని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. పట్టణంలోని రోటరీ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన పార్టీ నూజివీడు నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని భావిస్తున్నామని, తెలంగాణలో కూడా ఊహించని విధంగా అన్ని పార్టీల కంటే మెజారిటీ స్థానాలను వైఎస్సార్సీపీనే గెలుచుకుంటుందని ఆయన చెప్పారు. డిసెంబర్ ఒకటి నుంచి గడపగడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని నిర్వహించి పార్టీని మరింత పటిష్టవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. పార్టీకి కార్యకర్తలే వెన్నెముక... ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే వెన్నెముకని చెప్పారు. కార్యకర్తలు పటిష్టంగా ఉంటేనే పార్టీ పటిష్టంగా ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికలలో టీడీపీ, కాంగ్రెస్‌లు మట్టికొట్టుకుపోవడం ఖాయమన్నారు. విభజన నష్టాలు ప్రజలకు వివరించాలి... రాష్ట్ర విభజన వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాలని పార్టీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజించేందుకు అప్రజాస్వామికంగా, అడ్డగోలుగా తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటం కోసం జననేత జగన్మోహన్రెడ్డి అవిశ్రాంత పోరాటం చేస్తున్నారన్నారు. పార్టీని అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు బూత్‌స్థాయి కమిటీలను, గ్రామ, మండల స్థాయి కమిటీలను ఏర్పాటుచేయాలన్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు బసవా భాస్కరరావు, దేశిరెడ్డి రాఘవరెడ్డి, లాము ప్రసాదరావు, కలగర వెంకటేశ్వరరావు, పిళ్లా చరణ్, కోటగిరి గోపాల్, మందాడ నాగేశ్వరరావు, పల్లెర్లమూడి అభినేష్, నెర్సు పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ను ఏ శక్తీ ఆపలేదు
44 ఏళ్లుగా సీమాంధ్ర నాయకులే సీఎంలుగా ఉన్నరు. నాడు తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఎవరూ మాట్లాడలేకపోయారు. ఇందుకు సీమాంధ్ర సీఎంలు బాధ్యులు కాదా? నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీమాంధ్రకు ఏదో జరిగిపోతుందంటున్నరు. అక్కడి ప్రజలను భయపెట్టేలా లేనిపోని అవాస్తవాలు మాట్లాడుతున్నరు. డిసెంబర్లో తెలంగాణ రాష్ట్ర తథ్యం.. ఇప్పుడు ఏ శక్తీ ఆపలేదు - దామోదర రాజనర్సింహా ఉప ముఖ్యమంత్రి గద్వాల, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచే ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం కొనసాగిం దని, ఈ పోరాటంలో ఎందరో ప్రాణత్యాగా లు చేశారని ఉప ముఖ్యమంత్రి దామోదర రా జనర్సింహా గుర్తుచేశారు. ఇన్నేళ్ల పోరాటాన్ని అర్థం చేసుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఓ నిర్ణయం తీసుకున్నార ని, ఇప్పుడు ఏ శక్తి అడ్డొచ్చినా తెలంగాణను ఆపలేదని స్పష్టంచేశారు. మంగళవారం గద్వాల పట్టణంలో ని తేరుమైదానంలో తెలంగాణ జైత్రయాత్ర సభ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడు తూ.. 1956 నుంచి తెలంగాణకు అన్నింటా అన్యాయం చేస్తూ వచ్చారని, తె లంగాణ ప్రజలు పోరాడి కేంద్రానికి తెలిసేలా చేసి ముల్కీ నిబంధనలను తెచ్చుకున్నారని గు ర్తుచేశారు. దీన్ని కూడా ఓర్వలేని సీమాంధ్రులు హైకోర్టుకు వెళ్లి వారికి అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చేసుకున్నారని తెలిపారు. దీంతో తెలంగాణలో 1969 లో ప్రత్యేకరాష్ట్రం కోసం పెద్దఎత్తున ఉద్యమం జరిగిందన్నారు. పెద్ద మనుషుల ఒప్పందం, 610 జీఓను ఉల్లంఘించి అన్యాయం చేస్తూ వ స్తున్నారని అన్నారు. వీటన్నింటిని పరిశీలించిన సోనియాగాంధీ ప్రత్యేకరాష్ర్ట ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఎవరైనా ఉండొచ్చు తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా తమకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడుతుంటే మా ట్లాడని టీడీపీ, వైఎస్ఆర్ సీపీలు ఇప్పుడు మా ట్లాడటం ఏమిటని విమర్శించారు. లేఖలు ఇ చ్చారు, అఖిలపక్షాల సమావేశాల్లో అభిప్రాయాలు చెప్పారు, ఇప్పుడు సమైక్యాంధ్ర అని మాట్లాడుతున్నారని అన్నారు. కేవలం సీమాం ధ్రలో రాజకీయ లబ్ధికోసమే నాటాకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో ఎవరైనా ఉండొచ్చని, పొమ్మని ఎవరంటారని ప్ర శ్నించారు. కేవలం అపోహలు కల్పించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. డిసెంబర్లో తె లంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని, 2014 ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయన్నది నిజమ ని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా స్పష్టంచేశారు. పీసీసీ మాజీ అధ్యక్షులు డి. శ్రీ నివాస్, కేంద్ర మంత్రులు సర్వే సత్యనారాయ ణ, బలరాంనాయక్, మంత్రులు జానారెడ్డి, డీ కే అరుణ, బసవరాజు సారయ్య, సుదర్శన్‌రెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, పొన్నాల ల క్ష్మయ్య, గడ్డం ప్రసాద్‌కుమార్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్‌బా బు, ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, పొ న్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్‌రె డ్డి, రాజ య్య, సురేష్ షెట్కార్, కోమటిరెడ్డి రా జగోపాల్‌రెడ్డి, వివిధ జిల్లాల ఎమ్మెల్యేలు, డీ సీసీ అధ్యక్షులు, కాంగ్రెస్‌పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
తెలంగాణ రైతులపై చిన్నచూపు
ముస్తాబాద్/ఎల్లారెడ్డిపేట/చందుర్తి/పెద్దపల్లి/మంథని/గొల్లపల్లి, న్యూస్‌లైన్ : తెలంగాణ రైతులను కిరణ్ సర్కార్ చిన్నచూపు చూస్తోందని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు విమర్శించారు. పెద్దపల్లి ఎంపీ వివేక్, పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, సిహెచ్.రమేష్‌బాబు, కావేటి సమ్మయ్య, పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వినోద్‌కుమార్, నారదాసు లక్ష్మణ్‌రావులతో కూడిన బృందం శనివారం పంటనష్టంపై అధ్యయనం చేసింది. ముస్తాబాద్ మండలం రామలక్ష్మణులపల్లి, ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్, పదిర, చందుర్తి మండలం తిమ్మాపూర్, మంథని మండలం పుట్టపాక, పెద్దపల్లి మండలం కాసుపల్లి, గొల్లపల్లి మండలం రాఘవపట్నం, గుంజపడుగు గ్రామాల్లో పంట నష్టాన్ని పరిశీలించారు. రైతులకు జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల సీమాంధ్రలో ఫై-లీన్ తుపాను బాధితులను ఆదుకునేందుకు తక్షణ సహాయం కింద రూ.70 కోట్లు ప్రకటించిన కిరణ్ సర్కారు.. తెలంగాణ ప్రాంతంలోని రైతులు నష్టపోతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ఒక్క నయపైసా ఇవ్వనని ప్రకటించాడని, నేడు అదే విధానాన్ని అవలంబిస్తూ తెలంగాణ రైతుల ఉసురు పోసుకుంటున్నాడని దుయ్యబట్టారు. నష్టపోయిన తెలంగాణ రైతాంగానికి అండగా ఉండేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నెలరోజుల వేతనం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలోని ఏడు జిల్లాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు ఆరు బృందాలుగా ఏర్పడి కేసీఆర్ ఆదేశాల మేరకు పంట నష్టాలను సర్వే చేస్తున్నట్లు తెలిపారు. వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టాన్ని రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో సర్వే చేయించాల్సిన ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదని, అధికారులు సైతం దళారులతో కుమ్మక్కయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మొలకెత్తిన, రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పుట్టెడు దుఃఖంలో ఉంటే కాంగ్రెస్ నేతలు జైత్రయాత్ర చేయడం విడ్డూరంగా ఉందని, ఇందుకు వారికి మనసెలా ఒప్పిం దని అన్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్న సీఎం కిరణ్‌పై దండయాత్ర చేయాలన్నారు. జిల్లాకు చెందిన శ్రీధర్‌బాబు మంత్రిగా ఉన్నా రైతులకు పరిహారం ఇప్పించడంలో విఫలమయ్యాడని విమర్శించారు. ఇప్పటికైనా రైతుల పక్షాన తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నిలువాలని సూచించారు. ఈ బృందం వెంట టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, మహిళా నాయకులు తుల ఉమ, బొడిగె శోభ తదితరులు పర్యటించారు. -
సమ్మె చీకటి
అనంతపురం న్యూటౌన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన 72 గంటల సమ్మెతో అనంతపురం జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు ధర్మవరం, హిందూపురం, మడకశిర, తాడిపత్రి, గుంతకల్లు, పెనుకొండ, కళ్యాణదుర్గం తదితర ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉద్యోగుల సమ్మె కారణంగా శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం, కడపలోని ఆర్టీపీపీ, విజయవాడలోని వీటీపీఎస్‌లో సేవలు నిలిచిపోయాయి. దీంతో జిల్లాకు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తాయి. ఈ నెల 11న అర్ధరాత్రి నుంచి జిల్లాలోని రెండు వేల మంది విద్యుత్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంతో సమస్య పరిష్కారమయ్యే అవకాశం లేకుండా పోయింది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. హిందూపురం, తాడిపత్రి, అనంతపురం, గుత్తి, కదిరి డివిజన్లలో 24 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ఇవి పునరుద్ధరణకు నోచుకోక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు 150 గ్రామాల్లో మూడు రోజులుగా చీకట్లు అలుముకున్నాయి. జిల్లా కేంద్రంలో సైతం సమస్యలు తలెత్తాయి. స్థానిక ఎంజీ పెట్రోల్ బంక్ ప్రాంతం, 3,4,5,6వ రోడ్లు, రంగస్వామినగర్, తపోవనం, ఆజాద్‌నగర్, హైదరవలి కాలనీ, విమలా ఫరూక్నగర్, లక్ష్మీనగర్ తదితర ప్రాంతాలు 48 గంటల పాటు అంధకారం నెలకొంది. ఇక్కడ 12వ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికీ పునరుద్ధరణకు నోచుకోలేదు. విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రారంభమైన తొలిరోజు పెద్దగా సమస్యలు తలెత్తకపోయినా.. శుక్రవారం సాయంత్రం నుంచి మాత్రం జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా సమస్యలు మొదలయ్యాయి. అనంతపురంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలకు ఉదయం పూట విద్యుత్ సరఫరాను నిలిపేశారు. హిందూపురం, ధర్మవరం, గుంతకల్లు, తాడిపత్రి, కదిరి, రాయదుర్గం, పెనుకొండ, మడకశిర, కళ్యాణదుర్గం పట్టణాలతో పాటు జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,200 గ్రామాలకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పరిశ్రమలకు దెబ్బ విద్యుత్ ఉద్యోగుల సమ్మె వల్ల జిల్లాలోని పలు పరిశ్రమలలో మూడు రోజుల పాటు ఉత్పత్తి నిలిచిపోయింది. తాడిపత్రిలోని గ్రానైట్, నాపరాళ్ల పరిశ్రమలు, హిందూపురంలోని స్టీల్ ప్లాంట్లు, రాయదుర్గంలోని టెక్స్టైల్స్ పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రెండు రోజుల పాటు వాటికి సెలవు ప్రకటించారు. విద్యుత్ ఉత్పత్తి లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని, పది శాతం మంది ఉద్యోగులు కూడా అందుబాటులో లేకపోవడంతో అత్యవసర సేవలు కూడా అందించలేకపోయామని ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ రమణమూర్తి తెలిపారు. ముగిసిన విద్యుత్ ఉద్యోగుల సమ్మె విద్యుత్ ఉద్యోగుల సమ్మె శనివారం అర్ధరాత్రి ముగిసింది. సమ్మె ముగియగానే ఉద్యోగులు యధావిధిగా విధులకు హాజరయ్యారు. సమ్మె సమయంలో తలెత్తిన విద్యుత్ సమస్యలను ఆదివారం మధ్యాహ్నంలోపు పరిష్కరించడానికి అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. -
ఇది ప్రజా ఉద్యమం
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: సీమాంధ్రలో జరుగుతున్నది ప్రజా ఉద్యమమని విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ చిత్తశుద్ధితో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేస్తే అసెంబ్లీతోపాటు పార్లమెంటుకు కూడా తాళాలు పడతాయని, అప్పుడు కేంద్రం దిగివస్తుందన్నారు. ప్రొద్దుటూరులోని అనిబిసెంట్ క్రీడా మైదానంలో గురువారం సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ప్రొద్దుటూరు పొలికేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ నేడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి.. దీనినే ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.. సర్వేపల్లి ఆంధ్రమహాసభ అధ్యక్షులుగా కూడా పనిచేశారు.. 1920లో తెలుగు మాట్లాడే ప్రజలు ఒక్కటిగా ఉండాలని మహాత్మాగాంధీ సర్వేపల్లికి లేఖ రాశారన్నారు. స్వాతంత్య్రం అనంతరం భాషాప్రయుక్త రాష్ట్రాల ప్రకారం తెలుగు మాట్లాడే ప్రజలందరినీ ఒకే గొడుగు కిందికి తేవాలని కోరారన్నారు. అసలైన గాంధీ తెలుగు ప్రజలందరూ ఒక్కటిగా ఉండాలని కోరుకోగా నేటి నకిలీ గాంధీ రాష్ట్రాన్ని విడదీయాలని కుట్రపన్నుతోందని సోనియాగాంధీని ఉద్దేశించి పరోక్షంగా అన్నారు. ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమాలు చేస్తున్నారని, ఈ తీవ్రతను చూస్తుంటే రాష్ట్ర విభజన జరగదనే విశ్వాసం తనలో కలుగుతోందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడ ంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు రాజకీయ పక్షాలన్నీ విఫలమయ్యాయన్నారు. మరో మాటలో చెప్పాలంటే వీరు సమైక్యాంధ్రకు వెన్నుపోటు పొడిచారన్నారు. మహారాష్ట్రలోని విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని అక్కడి వారు 15 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారన్నారు. దక్షిణ తమిళనాడులో, గుజరాత్లో కూడా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని అసెంబ్లీలో మాయావతి తీర్మానం కూడా చేశారన్నారు. ఇన్ని చోట్ల డిమాండ్ చేస్తున్నా పట్టించుకోని కేంద్రం ఐక్యంగా ఉన్న తెలుగుప్రజలను విడదీసేందుకు కుట్రపన్నిందన్నారు. తెలంగాణ ప్రజలు సైతం ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని, తాను స్వయంగా ఈ విషయాన్ని గ్రహించానన్నారు. 1969లో, 1972లో రాష్ట్ర విభజనకు సంబంధించి సంఘర్షణ జరిగిందని తెలిపారు. అయితే రెండు మార్లు సమైక్యవాదమే గెలిచిందన్నారు. సీమాంధ్ర నేతలు రాజీనామా పత్రాలను స్పీకర్ ఫార్మాట్లో పంపకుండా రాజీ డ్రామాలు ఆడుతున్నారన్నారు. సీమాంధ్రలో ప్రజా ఉద్యమం జరుగుతుంటే తెలంగాణ వారు నానా దుర్భాషలాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రిని సైతం ఇడ్లీ బండి పెట్టుకుంటే తమకు అభ్యంతరం లేదని అన్నారంటే ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం మరొకటి ఉందా అని ప్రశ్నించారు.తాను రాష్ట్రంలో 5వేల కిలోమీటర్లు పర్యటించానన్నారు. తెలంగాణ ప్రజలంతా సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని, వాస్తవానికి తెలంగాణ సమాజం అంటూ లేదని తెలిపారు. కొంతమంది స్వార్థపరులు మాత్రమే తెలంగాణవాదం అంటున్నారన్నారు. ప్రధమ ముద్దాయిలు రాజకీయ నేతలే ఆర్టీపీపీ (ఎర్రగుంట్ల),న్యూస్లైన్ః రాష్ట్ర విభజన జరిగితే ప్రధమ ముద్దాయిలుగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు మిగిలిపోతారని విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్ తెలిపారు. గురువారం సాయంత్రం ఆర్టీపీపీలో సమైక్యాంధ్ర సాధన కోసం చేస్తున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి నిమ్మరసం ఇచ్చి దీక్షాపరులను విరమింప చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తెలుగు జాతిని విభజించడానికి సోనియా ఎవరన్నారు. మనం నమ్మిన ప్రజాప్రతినిధులు ద్రోహం చేయడంతోనే రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేపట్టాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రం విడిపోతే రైతాంగం పంట కాలువలను నీటితో కాక కన్నీళ్లతో నింపుకోవాల్సి వస్తుందన్నారు. అనంతరం ఆర్టీపీపీ జేఏసీ నాయకులు ప్రతాప్‌రెడ్డి, శంకర్రావు తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. ఎస్ఈలు రమణారెడ్డి, శేషారెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, నాగరాజు, రామసుబ్బారెడ్డి, డీజీఎం నాగేశ్వర్రావు పాల్గొన్నారు. -
అస్త్ర సన్యాసం
సాక్షి, నెల్లూరు: రాష్ట్ర విభజన ప్రకటన సీమాంధ్రలో అగ్గి రాజేసింది. కాంగ్రెస్ కుటిల నిర్ణయంతో కడుపు మండిన సమైక్య వాదులు రోడ్లెక్కి ఆందోళనలకు దిగారు. పర్యవసానంగా సమైక్యాంధ్ర ఉద్యమం చరిత్రలో ఎన్నడూ లేనంతగా జోరుగా సాగుతోంది. అంతెందుకు ప్రభుత్వ ఉద్యోగులు సైతం విభజనను వ్యతిరేకిస్తూ ఉద్యమం కోసం విధులను వదలి వీధులకెక్కారు. ఏ ప్రజల ఓట్లతో అధికార దర్పం అనుభవిస్తున్నారో ఆ ప్రజల ఆకాంక్షతో తమకెందుకు అన్నట్టుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, సిటీ ఎమ్మెల్యే శ్రీధరకృష్ణారెడ్డి, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరిచినట్టున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కనీసం ఉద్యమకారులకు మద్దతు ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఉద్యమ ప్రారంభంలో ఒకటిరెండు ప్రకటనలు, మొక్కుబడి కార్యక్రమాలతో తమ బాధ్యత పూర్తయినట్టు చేతులు దులుపు కున్నారే తప్పించి ఆ తర్వాత పత్తా లేరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ సమైక్యాంధ్రంటే తామే అన్నట్టుగా మీడియాలో నానా హంగామా చేసిన ఆనం సోదరులు, తీరా ఉద్యమం మొదలయ్యాక అస్త్ర సన్యాసం చేయడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఒక వైపు ఉద్యమం తీవ్రరూపం దాల్చి జిల్లా ఆందోళనలతో అట్టుడికి పోతుంటే ఎమ్మెల్యేలు,మంత్రి మాత్రం ఉద్యమం పక్కన పెట్టి నియోజక వర్గాలలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు పరిమిత మయ్యారన్న విమర్శలున్నాయి. పనికంటే మిగిలివన్నీ ఎక్కువ చేసే ఆనం వివేకా కనపడకుండా తిరుగు తుండడం ఆనం సోదరుల నైజాన్ని తెలియ జేస్తోందని సమైక్య వాదులు మండిపడుతున్నారు. రూరల్ ఎమ్మెల్యే కనుసన్నలలో మెలిగే నగర ఎమ్మెల్యే ముంగమూరు విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మంత్రి ఆనం మాత్రం స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని వెళ్లారు. ఆ తర్వాత నెల్లూరు వైపు తిరిగి చూడలేదు. జిల్లాలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సమైక్యాంధ్ర కోసం తమవంతుగా దీక్షలకు దిగారు. ఆందోళనల బాట పట్టారు. ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొట్టే ఆనం సోదరులు మాత్రం ఆచరణలో చూపకపోవడంతో జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సీమాంధ్ర ఆందోళనలపై ప్రధాని స్పందించాలి
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ : సీమాంధ్రలోని 13 జిల్లాల్లో 20 రోజులుగా మహోద్యమం జరుగుతుంటే ప్రధాని మన్మోహన్సింగ్ స్పందించకపోవడం దారుణమని రాయలసీమ కార్మిక కర్షక సేవా సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కడప కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహార దీక్షచేస్తున్న వైఎస్ అవినాష్‌రెడ్డి, అంజాద్‌బాషా, నాగిరెడ్డిలను బుధవారం సీహెచ్ పరామర్శించి దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సంద ర్భంగా సీహెచ్ మాట్లాడుతూ విభజన వల్ల సమస్యలు చాలా జటిలమవుతాయన్నారు. తెలుగువారి ఐక్యతకు ఉన్న చారిత్రక నేపథ్యం తెలుసుకోకుండా మాట్లాడటం తెలంగాణ వాదులకు తగదన్నారు. విభజన వల్ల రాయలసీమలోని తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, చిత్రావతి ప్రాజెక్టులకు ఒక్క చుక్కకూడా నీరు రాదన్నారు. ఫలితంగా రాయలసీమ శాశ్వత ఎడారిగా మారుతుందని హెచ్చరించారు. 23 జిల్లాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాదును దేశంలోనే పేరుగాంచే విధంగా అభివృద్ది చేశారన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పునరాలోచన చేయకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.