కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ : సీమాంధ్రలోని 13 జిల్లాల్లో 20 రోజులుగా మహోద్యమం జరుగుతుంటే ప్రధాని మన్మోహన్‌సింగ్ స్పందించకపోవడం దారుణమని రాయలసీమ కార్మిక కర్షక సేవా సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కడప కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహార దీక్షచేస్తున్న వైఎస్ అవినాష్‌రెడ్డి, అంజాద్‌బాషా, నాగిరెడ్డిలను బుధవారం సీహెచ్ పరామర్శించి దీక్షకు సంఘీభావం తెలిపారు.
ఈ సంద ర్భంగా సీహెచ్ మాట్లాడుతూ విభజన వల్ల సమస్యలు చాలా జటిలమవుతాయన్నారు. తెలుగువారి ఐక్యతకు ఉన్న చారిత్రక నేపథ్యం తెలుసుకోకుండా మాట్లాడటం తెలంగాణ వాదులకు తగదన్నారు. విభజన వల్ల రాయలసీమలోని తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, చిత్రావతి ప్రాజెక్టులకు ఒక్క చుక్కకూడా నీరు రాదన్నారు. ఫలితంగా రాయలసీమ శాశ్వత ఎడారిగా మారుతుందని హెచ్చరించారు. 23 జిల్లాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాదును దేశంలోనే పేరుగాంచే విధంగా అభివృద్ది చేశారన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పునరాలోచన చేయకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
సీమాంధ్ర ఆందోళనలపై ప్రధాని స్పందించాలి
Published Thu, Aug 22 2013 3:18 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM
Advertisement
Advertisement