ఆదిలాబాద్ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : వ్యవసాయ పరిశోధన స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, ఏరువాక కేంద్రం నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన కేంద్రం ఎదుట ప్లకార్డులతో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాన్ టీచింగ్ ఉ ద్యోగుల సంఘం కన్వీనర్ చక్రధర్ మాట్లాడు తూ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగుల మా దిరిగా హెల్త్‌కార్డులు, అర్హులకు ఇళ్లస్థలాలు మం జూరు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉ ద్యోగులతో సమానంగా మధ్యంతర భృతి 2014 జనవరి నుంచి చెల్లించాలని అన్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాల ని, ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో జి.వెంకటి, అశోక్, రాజమౌళి, దేవానంద్, మహేశ్, గంగారాం, తదితరులు పాల్గొన్నారు.