నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్: ఒక వ్యక్తికి రెండు ప్రాంతాల్లో ఓట్లు ఉంటే ఎన్నికల అధికారులు వాటిని తొలగిస్తున్నారు. డబుల్ ఓట్ల తొలగింపును ఈ నెల 30వ తేదీలోగా పూర్తి చేసి ఎన్నికల కమిషన్‌కు వాస్తవ నివేదికను పంపేందుకు ఎన్నికల విభాగం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రెండు ప్రాంతాల్లో ఓట్లు ఉన్న అభ్యర్థులకు ఎక్కడ ఓటు ఉండాలో, ఎక్కడ తొల గించాలో సంజాయిషీ ఇవ్వాలని నోటీసులు జారీ చేస్తున్నారు. కొందరు బూత్‌స్థాయి అధికారులు నోటీసులు జారీ చేయకుండానే రెండు ఓట్లనూ తొలగిస్తున్నారు.
తొలగింపు ఇలా...
ఒక వ్యక్తి ఏ జిల్లాలోనైనా రెండు ఓట్లు ఉండి.. ఎన్నికల అధికారులు ఇంటింటి సర్వేకు వెళ్లినప్పుడు ఆ అభ్యర్థి ఇంటివద్ద లేకుంటే ఆ ప్రాంతంలో ఉన్న ఓటు తొలగిస్తారు. మరోప్రాంతంలో ఉన్న ఓటు కూడా ఇంటి పక్కవారిని విచారించి తొలగిస్తారు. దీనితో రెండు ప్రాంతాల్లో కూడా ఓటు రద్దయ్యే అవకాశముంది. ఒకరికి రెండుచోట్ల ఓట్లు ఉన్నట్లు కంప్యూటర్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. రెండు ఓట్లు ఉన్న అభ్యర్థుల జాబితా కంప్యూటర్‌లో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ జాబితాను ప్రింట్‌తీసి అందులో అడ్రస్ ప్రకారం బీఎల్‌ఓలు విచారించి ఓటు తొల గిస్తారు. ఇతర నియోజకవర్గం, జిల్లాలో డబుల్ ఓటు ఉంటే స్పష్టంగా తెలియడంతో డబుల్ ఓట్ల తొల గింపు సులభంగా ఉంది. గతంలో కంప్యూటరీకరణ లేనప్పుడు ఒక వ్యక్తికి ఇతర ప్రాంతాల్లో ఎన్నో ఓట్లు ఉన్నా తెలిసేవి కావు. జనవరి నాటికి జిల్లాలో డబుల్ ఓట్లు ఎన్ని ఉన్నాయో తెలిసే అవకాశముంది.
ఇక.. డబుల్ ఓట్లకు చెక్
Published Fri, Dec 13 2013 2:33 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM
Advertisement