ఇక ఎక్కడి నుంచైనా ఓటరు కార్డు | Now, Voter card can be downloaded from anywhere | Sakshi
Sakshi News home page

ఇక ఎక్కడి నుంచైనా ఓటరు కార్డు

Published Fri, Mar 7 2014 3:12 AM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM

Now, Voter card can be downloaded from anywhere

రాష్ట్రంలోని అన్ని మీ-సేవ కేంద్రాల్లో పొందే వెసులుబాటు
 సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నవారికి శుభవార్త. ఇక నుంచి రాష్ట్రంలో ఏ మీ-సేవ కేంద్రం నుంచైనా ఓటరు గుర్తింపు కార్డును పొందే వెసులుబాటు కల్పించనున్నట్లు మీ-సేవ డెరైక్టర్ ఎంఎం నాయక్ గురువారం వెల్లడించారు. వచ్చే 15 రోజుల తర్వాత ఓటర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి రానుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2 వేల మీ-సేవ కేంద్రాల్లో అర్హులైన వారు తమ ఓటరు గుర్తింపు కార్డులు పొందేందుకు వీలుంటుందన్నారు. ఇప్పటి వరకూ తమ నియోజకవర్గంలోని మీ-సేవ కేంద్రంలోనే ఓటరు గుర్తింపు కార్డులు పొందే అవకాశం ఉందని, దీని వల్ల ఓటర్లు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మీ-సేవ కేంద్రాల్లో కలర్ పీవీసీ ఎపిక్ కార్డులు పంపిణీ చేస్తున్నామని నాయక్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement