MM Nayak
-
జిరాక్స్ కాపీలే కాలేజీలకు ఇవ్వండి
సాక్షి, అమరావతి: ఏపీ ఎంసెట్–2020 ద్వారా వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీలో చేరే సమయంలో సర్టిఫికెట్లకు సంబంధించి జిరాక్స్ కాపీలు మాత్రమే సమర్పించాలని అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ ప్రత్యేక కమిషనర్ ఎంఎం నాయక్ కోరారు. ఈ మేరకు విద్యార్థులకు జారీచేసిన అలాట్మెంట్ ఆర్డర్లలో పలు సూచనలు పొందుపరిచారు. ఇలా చేయాలి.. ► అభ్యర్థులు ముందుగా అలాట్మెంట్ ఆర్డర్‌ను ‘ఏపీఈఏఎంసీఈటీ.ఎన్ఐసీ.ఐఎన్’ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ► ఆ తరువాత అభ్యర్థి లాగిన్ అయి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ► తదుపరి జాయినింగ్ రిపోర్ట్, అలాట్మెంట్ ఆర్డర్, రిసీప్ట్ ఆఫ్ సర్టిఫికెట్లను రెండు కాపీల చొప్పున ప్రింట్ తీసుకుని వారికి కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలి. ► ఒక కాపీని కాలేజీలో సమర్పించి.. రెండో కాపీపై అకనాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. ► ఆన్లైన్లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు వెబ్సైట్ నుంచి రిసీప్ట్ ఆఫ్ సర్టిఫికెట్‌ను డౌన్లోడ్ చేసుకుని దాన్ని కూడా కాలేజీలో సమర్పించాలి. సీటు కేటాయింపు అయిన అభ్యర్థులు దాన్ని నిలుపుకోవాలంటే సెల్ఫ్ రిపోర్టింగ్‌తో పాటు, కాలేజీలో రిపోర్టు చేయడం తప్పనిసరి. ఇందుకు చివరి తేదీ 2021 జనవరి 8. ► వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్, అనంతరం కాలేజీలో రిపోర్టు చేయని వారి అలాట్మెంట్ సీటును ఖాళీగా పరిగణిస్తారు. తరువాత కౌన్సెలింగ్ సమయంలో మొదటి విడత సీటు కేటాయింపు రద్దవుతుంది. ► రెండో కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చిన అభ్యర్థుల్లో అర్హులకు దాన్ని కేటాయిస్తారు. ► విద్యార్హతలకు సంబంధించిన వివరాలు పరిశీలనలో తప్పని తేలితే సదరు అభ్యర్థికి సీటును రద్దుచేయడంతో పాటు క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకుంటారు. ► అభ్యర్థులు అడ్మిషన్ల సమయంలో సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులనే సమర్పించాలి. ► ఒరిజినల్ సర్టిఫికెట్లను కేవలం పరిశీలన వరకు అందించి తదుపరి వెనక్కి తీసుకోవాలి. ► ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు అర్హులు కాని అభ్యర్థులు తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన తరువాత మాత్రమే ఆయా కాలేజీల్లో ట్యూషన్ ఫీజులు చెల్లించాలి. ► తుది విడత సీట్ల కేటాయింపు పూర్తయ్యే వరకు విద్యార్థుల నుంచి కాలేజీ యాజమాన్యాలు ఎలాంటి ఫీజులు వసూలుచేయకూడదు. నేటి నుంచి ఇంజనీరింగ్ తరగతులు తొలివిడత కౌన్సెలింగ్ ముగియడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ తరగతులను బుధవారం నుంచి ప్రారంభించేలా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అకడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించింది. కోవిడ్–19 నేపథ్యంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించేలా ఆదేశాలు జారీచేసింది. ఇదీ క్యాలెండర్.. ప్రొఫెషనల్ యూజీ కోర్సుల తరగతుల ప్రారంభం : జనవరి 6 ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు : ఏప్రిల్ 17 సెకండ్ సెమిస్టర్ ప్రారంభం : మే 3 సెకండ్ సెమిస్టర్ పరీక్షలు : ఆగస్టు 23 థర్డ్ సెమిస్టర్ ప్రారంభం : సెప్టెంబర్ 1 -
ఎంసెట్ తొలివిడత కౌన్సెలింగ్‌లో 72 వేలకు పైగా సీట్లు భర్తీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఎంసెట్–2020 తొలివిడత కౌన్సెలింగ్‌లో భాగంగా 72,867 మందికి సీట్లు కేటాయించారు. ఈ మేరకు అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ ఆదివారం సాయంత్రం అభ్యర్థులకు సీట్లు కేటాయింపు పూర్తి చేయించారు. ఈసారి ఎంసెట్‌లో ఆన్లైన్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల పరిశీలన గతేడాది అక్టోబర్ 23 నుంచి ప్రారంభం అయినా ఫీజులు, కాలేజీల అఫ్లియేషన్ జాప్యంతో వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ డిసెంబర్ 28 నుంచి ఈనెల 1వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం ఎంసెట్‌లో 1,29,714 మంది అర్హత సాధించగా 90,076 మంది కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 89,078 మంది ధ్రువపత్రాలను పరిశీలన చేయించుకున్నారు. 83,014 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. రాష్ట్రంలోని 380 ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లోని మొత్తం సీట్లలో కన్వీనర్ కోటా కింద 1,03,766 సీట్లు ఉండగా వాటిలో 72,867 మొదటి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ అయ్యాయి. ఇంకా 30,899 సీట్లు మిగిలి ఉన్నాయి. యూనివర్సిటీల పరిధిలోని ప్రభుత్వ కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్లు 5,649, ఫార్మసీ సీట్లు 77 భర్తీ చేశారు. ప్రయివేటు కాలేజీల్లోని ఇంజనీరింగ్ సీట్లు 66,900, ఫార్మసీ సీట్లు 241 భర్తీ అయ్యాయి. ఇంకా స్పోర్ట్స్ కేటగిరీలోని 465 మందికి సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన నివేదికలు శాప్ నుంచి అందనందున వారికి మొదటి విడతలో సీట్లు కేటాయించలేదు. వారికి తదుపరి సీట్లు కేటాయించనున్నట్లు కన్వీనర్ నాయక్ వివరించారు. ఈసారి జీవో అలాట్మెంట్ కాలేజీ ఒక్కటే కాలేజీల్లో ప్రమాణాలు, ఇతర సదుపాయాల విషయంలో ప్రభుత్వం ఈసారి పగడ్బందీ చర్యలు తీసుకోవడంతో దాని ప్రభావం కౌన్సెలింగ్‌లో స్పష్టంగా కనిపించింది. గతంలో జీరో అలాట్‌మెంటు కాలేజీల నుంచి 20 సీట్లు కూడా భర్తీ కాని కాలేజీల సంఖ్య ఎక్కువగా ఉండేది. కానీ ఈసారి ప్రభుత్వమే సరైన ప్రమాణాలు, నిర్ణీత నిబంధనల ప్రకారం సదుపాయాలు, సిబ్బంది లేని కాలేజీలను జీవో అడ్మిషన్ల కేటగిరీలో చేర్చి వాటికి సీట్ల కేటాయింపును నిలిపివేసింది. ఇంజనీరింగ్‌లో 48, బీ ఫార్మసీలో 5 కాలేజీలకు అడ్మిషన్ల జాబితా నుంచి తప్పించింది. 54 కాలేజీల్లో 100 శాతం సీట్ల భర్తీ ఈసారి పూర్తి స్థాయిలో వంద శాతం సీట్లు భర్తీ అయిన కాలేజీల సంఖ్య గతంలో కన్నా పెరిగింది. 2019 ఎంసెట్‌లో తొలివిడత కౌన్సెలింగ్‌లో 44 కాలేజీల్లో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కాగా ఈసారి వాటి సంఖ్య 54కు పెరిగింది. కంప్యూటర్ సైన్స్‌దే అగ్రస్థానం ఏపీ ఎంసెట్–2020 తొలివిడత సీట్ల కేటాయింపులో అత్యధిక సీట్లు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలోనే భర్తీ అయ్యాయి. గతంలో మాదిరిగానే ఆ విభాగం అగ్రస్థానంలో ఉంది. ఐటీ, ఈసీఈ విభాగాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. -
పాలిసెట్ అడ్మిషన్స్ షెడ్యూల్ పొడిగింపు
సాక్షి, అమరావతి: ఏపీ పాలిసెట్ అడ్మిషన్ల షెడ్యూలును పొడిగిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పొడిగించిన గడువు తేదీలు ఇలా.. ► ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: అక్టోబర్ 21 వరకు ► ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు: అక్టోబర్ 22 వరకు ► సీట్ల కేటాయింపు: అక్టోబర్ 24 సాయంత్రం 6 తర్వాత. పాలిసెట్‌లో 60,780 మంది అర్హత సాధించగా శనివారం వరకు 35,346 మంది వెబ్ కౌన్సెలింగ్‌కు రిజిస్టర్ అయ్యారు. 34,288 మంది ధ్రువపత్రాల పరిశీలన జరగగా, 28,682 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. -
మద్య నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక
సాక్షి, అమరావతి: మద్యాన్ని ప్రజలకు దూరం చేయడమే తమ ముందున్న లక్ష్యమని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఎం.ఎం.నాయక్ తెలిపారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని, దాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేందుకు ఎక్సైజ్ అధికారులకు దిశానిర్దేశం చేస్తామని చెప్పారు. మద్యనిషేధం భవిష్యత్ కార్యాచరణపై కమిషనర్ మాటల్లోనే.. కలెక్టర్లు, ఎస్పీలు నిత్యం సమీక్షలు జరపాలి నవరత్నాల అమలును రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. నవరత్నాల్లో ఒకటైన దశలవారీ మద్యపాన నిషేధం అంశాన్ని నిత్యం జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు సమీక్షించాలి. ఇందుకు గాను ఆయా జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు మా వైపు నుంచి లేఖలు రాస్తున్నాం. మద్యం లైసెన్సీలతో సమావేశాలు నిర్వహించాలని, ప్రభుత్వ విధానం స్పష్టంగా చెప్పాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలిచ్చాం. మద్యం షాపుల ఎదుట ఎమ్మార్పీ బోర్డులు పెట్టాలని మా శాఖ మంత్రి నారాయణ స్వామి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఉల్లంఘనలు ఎక్కడైనా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మా శాఖ డీసీలు, ఏసీలు కొన్ని సమస్యలు చెప్పారు. ఎక్సైజ్ స్టేషన్ల రీఆర్గనైజేషన్, నిధుల విడుదల వంటి కొన్ని అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబరు మద్యం అక్రమ అమ్మకాలు, ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బెల్టు షాపులపై ఫిర్యాదులు చేసేందుకు కమీషనరేట్లో టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేశాం. ప్రజలు 1800 425 4868 నెంబరుకు ఫిర్యాదులు చేయవచ్చు. అన్ని ప్రభుత్వ శాఖలు మద్యపాన నియంత్రణకు సహకరించాలి. సమాచార శాఖను సంప్రదిస్తున్నాం. సినిమా హాళ్లలో మద్యపాన నియంత్రణపై ప్రచారం చేసేందుకు ఆలోచిస్తున్నాం. సినిమా హాళ్లలో స్లైడ్ల ద్వారా, గ్రామాల్లో కళాజాతల ద్వారా మద్యపాన నియంత్రణ కార్యక్రమాలు నిర్వహిస్తాం. బెల్టు షాపుల్ని అరికట్టడం, ఎమ్మార్పీ ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేయడంలో ప్రతిభ కనబరిచిన అధికారులకు రివార్డులు అందిస్తాం. 190 నాటుసారా తయారీ గ్రామాల్ని దత్తత రాష్ట్రంలో మొత్తం 190 గ్రామాల్లో నాటుసారా తయారీ సాంప్రదాయంగా వస్తోంది. ఈ గ్రామాల్లో నాటుసారాకు బానిసైన వారున్నారు. ‘జాగృతి’ అనే కార్యక్రమం ద్వారా ఈ గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈ గ్రామాల్ని ఎక్సైజ్ శాఖ అధికారులు దత్తత తీసుకుంటారు. నాటుసారా తయారీ నుంచి అక్కడి ప్రజలు బయటపడేలా ప్రభుత్వ శాఖల సాయంతో ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పిస్తాం. డీ–అడిక్షన్ కేంద్రాలు మద్యం దురలవాటును తగ్గించడానికి డీ–అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. మద్యానికి బానిసైన వారిని ఆ కేంద్రాల్లో చేర్పిస్తాం. కేరళ, పంజాబ్లలోని కేంద్రాలను ఇప్పటికే పరిశీలించాం. అక్కడి తరహాలోనే డీ–అడిక్షన్ కేంద్రాలు నిర్వహించేందుకు ప్రణాళిక ఉంది. -
రోడ్ల నిర్మాణాలు వేగవంతం
కలెక్టర్ ఎం. ఎం నాయక్ విజయనగరం మున్సిపాలిటీ : చంద్రన్న బాట పథకంలో భాగంగా చేపడుతున్న రహదారుల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఎం. ఎం నాయక్ ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స నిర్వహించి రహదారుల పనులను మండలాల వారీగా సమీక్షించారు. రహదారుల నిర్మాణాలతో పాటు బిల్లుల చెల్లింపులపై కూడా దృష్టి సారించాలని సూచించారు. ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున బిల్లులు త్వరగా చెల్లించాలన్నారు. పనులు చేపట్టని కాంట్రాక్టర్లను తొలగించి కొత్తవారిని నియమించుకోవాలని తెలి పారు. జిల్లా వ్యాప్తంగా 300 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించాల్సి ఉండగా ఇంతవరకు 141. 3 కిలోమీటర్లు నిర్మించినట్లు చెప్పారు. రోజుకు సరాసరి 4.5 కిలోమీటర్ల రహదారి నిర్మిస్తున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతరాజ్ ఎస్ఈ వేణుగోపాల్, ఈఈ, డీఈలు పాల్గొన్నారు. -
జిల్లా ప్రజలకు కలెక్టర్ సంక్రాంతి శుభాకాంక్షలు
విజయనగరం కంటోన్మెంట్: ఈ ఏడాది సంక్రాంతి పండగ ప్రతి ఇంటా సిరిసంపదలు కురిపించాలని కలెక్టర్ ఎం.ఎం.నాయక్ ఆకాంక్షించారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ పండగను ఘనంగా జరుపుకోవాలని, అందరికీ ఈ సంక్రాంతి శుభం కలిగించాలన్నారు. విద్యాపరంగా మంచి మార్కులతో అందరూ ఉత్తీర్ణత సాధించాలన్నారు. రైతులు వేసిన పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించాలన్నారు. ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. సంగీత సాహిత్య, సాంస్కృతిక పరంగానూ, క్రీడల్లోనూ బాగా రాణించి జిల్లా పేరు, ప్రతిష్టలు ఇనుమడించేలా అందరూ కృషి చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో సఫలీకృతులు కావాలని కలెక్టర్ నాయక్ ఈ సందర్భంగా అభిలషించారు. -
ప్రతి కుటుంబానికీ రెండు బ్యాంకు అకౌంట్లుండాలి
విజయనగరం కంటోన్మెంట్: జన్‌ధన్ యోజన పథకం కింద ప్రతి కుటుంబానికీ రెండు బ్యాంకు అకౌంట్లు ఉండాలని కలెక్టర్ ఎం.ఎం.నాయక్ స్పష్టం చేశారు. ఇందుకోసం గ్రామ సర్పంచ్‌లు, కార్యదర్శుల ద్వారా గ్రామాల్లో ఖాతాలు లేని కుటుంబాలను గుర్తించి బ్యాంకు అకౌంట్లు తక్షణమే తెరిపించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్డీఓ కార్యాలయం నుంచి మంగళవారం ఆయన తహశీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సహకరించని బ్యాంకర్ల వివరాలు తెలియజేస్తే తగు చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. మొదటి దశ రుణమాఫీ కార్యక్రమం కింద లబ్ధిపొందని రైతుల ఫిర్యాదులను పరిష్కరించి అప్లోడ్ చేయాలన్నారు. వేరే మండలానికి చెందిన ఫిర్యాదులను ఆయా మండలాలకు పంపించి పరిష్కరించాలని సూచించారు. రెండో దశకు అర్హులైన వారి వివరాలను త్వరితంగా అప్లోడ్ చేయాలన్నారు. రైతులకు అందజేస్తున్న ఈ పాస్ పుస్తకాలు వెయ్యి వరకూ పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన అందజేయాలన్నారు.వయోజన విద్యా కేంద్రాల్లో చదువుతున్న వారికి మార్చి 15వ తేదీన పరీక్ష జరగనుందని, ఈ పరీక్షకు అందరూ హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల ఏర్పాటు, ఇన్విజిలేటర్ల నియామకం, వసతుల ఏర్పాటు వంటి ప్రక్రియలు చేపట్టామని తెలిపారు. గతసారి హాజరు కానివారు, హాజరై పరీక్షలో ఫెయిల్ అయిన వారు మాత్రమే ఈ పరీక్షకు హాజరు కావాలని స్పష్టం చేశారు. సాక్షరభారత్ 5వ ఫేజ్ కింద జనవరి1వ తేదీనుంచి తరగతులు ప్రారంభమయ్యాయని, వారికి 6 నెలల తరువాత పరీక్ష నిర్వహిస్తారన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈఓ జి.రాజకుమారి, ఆర్డీఓ జె. వెంకటరావు, గ్రామీణ నీటి సరఫరా ఎస్ఈ గాయత్రీ దేవి, డ్వామా ఏపీడీ అప్పలనాయుడు, వయోజన విద్యా ఉప సంచాలకులు ఎం.అమ్మాజీరావు, మండలాల నుంచి తహశీల్దార్లు, ఎంపీడీఓలు, మండల అధికారులు పాల్గొన్నారు. -
ఎయిర్ పోర్టు స్థలంపై సర్వే
గూడెపువలస (భోగాపురం): మండలంలోని గూడెపువలసలో ఏర్పాటు చేయనున్న ఎరుుర్ పోర్టుకు సంబంధించిన స్థలాన్ని బు ధవారం కేంద్రం నుంచి వచ్చిన సర్వే బృందం పరిశీలించింది. బృంద సభ్యు లు గ్రామంలోని ప్రభుత్వ భూమి వివరాలను రెవె న్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో 2560 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టు గుర్తించా రు. ఈ మేరకు సదరు భూమి ప్లాన్‌ను గూగుల్ మ్యాపు ద్వారా పరిశీలించారు. ఆ ప్రాంతంలో గాలి దిశ ఏవిధంగా ఉందన్న అంశాన్ని కూడా పరిశీలించా రు. స్థలం సమీపంలో భారీ విద్యుత్ లైన్లు, కొబ్బరి తోటలు, జీడి మామిడి తోటలు ఉన్నాయూ అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. బృం దానికి కలెక్టరు ఎం.ఎం నాయక్ పూర్తి వివరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బృంద సభ్యులతో పాటు ఆర్డీఓ వెంకటరావు, తహశీల్దార్ జనార్ధనరావు, సర్వేయరు పాల్‌దాస్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
ఇక ఎక్కడి నుంచైనా ఓటరు కార్డు
రాష్ట్రంలోని అన్ని మీ-సేవ కేంద్రాల్లో పొందే వెసులుబాటు సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నవారికి శుభవార్త. ఇక నుంచి రాష్ట్రంలో ఏ మీ-సేవ కేంద్రం నుంచైనా ఓటరు గుర్తింపు కార్డును పొందే వెసులుబాటు కల్పించనున్నట్లు మీ-సేవ డెరైక్టర్ ఎంఎం నాయక్ గురువారం వెల్లడించారు. వచ్చే 15 రోజుల తర్వాత ఓటర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి రానుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2 వేల మీ-సేవ కేంద్రాల్లో అర్హులైన వారు తమ ఓటరు గుర్తింపు కార్డులు పొందేందుకు వీలుంటుందన్నారు. ఇప్పటి వరకూ తమ నియోజకవర్గంలోని మీ-సేవ కేంద్రంలోనే ఓటరు గుర్తింపు కార్డులు పొందే అవకాశం ఉందని, దీని వల్ల ఓటర్లు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మీ-సేవ కేంద్రాల్లో కలర్ పీవీసీ ఎపిక్ కార్డులు పంపిణీ చేస్తున్నామని నాయక్ చెప్పారు.