![Number of people recovering from coronavirus in AP has crossed 15000 mark - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/13/virus.jpg.webp?itok=qAXsRao4)
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 15,000 మార్కును అధిగమించింది. గడిచిన 24 గంటల్లోఆస్పత్రుల నుంచి 1,019 మంది డిశ్చార్జ్ అవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 15,412కి చేరింది.
శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 వరకు 17,624 మందికి పరీక్షలు నిర్వహించగా 1,933 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యారోగ్యశాఖ ఆదివారం బులెటిన్‌లో పేర్కొంది. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 29,168కి చేరాయి. వాటిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారికి సంబంధించిన కేసులు 2,403 ఉండగా, ఇతర దేశాల నుంచి వచ్చినవారివి 429 ఉన్నాయి. కరోనాతో ఇప్పటి వరకు 328 మంది మృతిచెందారు. యాక్టివ్ కేసులు 13,428 ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment